భారత్‌ దర్శన్; నైమిశారణ్యం పోదమా!

23 Mar, 2021 19:40 IST|Sakshi

గంగా రామాయణ్‌ యాత్ర (SHA10A). ఇది ఐఆర్‌సీటీసీ భారత్‌ దర్శన్‌లో భాగంగా ఏప్రిల్‌లో నిర్వహిస్తున్న టూర్‌ ప్యాకేజ్‌. ఈ ఐదు రోజుల (నాలుగు రాత్రులు) పర్యటన... ఏప్రిల్‌ ఏడవ తేదీన మొదలై పదకొండవ తేదీతో పూర్తవుతుంది. ఇందులో అయోధ్య, లక్నో, నైమిశారణ్యం, ప్రయాగరాజ్‌(అలహాబాద్‌), వారణాసిలను చూడవచ్చు.

సింగిల్‌ ఆక్యుపెన్సీ 30,200 రూపాయలు, డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 24,700 రూపాయలు, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23, 550 రూపాయలవుతుంది. 

► ఏప్రిల్‌ ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు హైదరాబాద్‌లో బయలుదేరిన ఇండిగో విమానం పది గంటల యాభై నిమిషాలకు వారణాసికి చేరుతుంది. వారణాసి ఎయిర్‌పోర్టులో రైల్వే టూర్‌ సిబ్బంది పికప్‌ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. చెక్‌ ఇన్‌ అయిన తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, గంగాతీరం సందర్శనం ఉంటాయి 

► ఎనిమిదవ తేదీ తెల్లవారు జామున విశ్వనాథుని దర్శనం తర్వాత గదికి వచ్చి బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి గదిని చెక్‌ అవుట్‌ చేయాలి. ప్రయాణం ప్రయాగరాజ్‌ వైపు సాగుతుంది. త్రివేణి సంగమం, అలోపీ దేవి దర్శనం తర్వాత హోటల్‌కు చేరడం, ఆ రాత్రి బస ప్రయాగ్‌రాజ్‌లోనే 

► తొమ్మిదవ తేదీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ చెక్‌ అవుట్‌ చేసి శృంగవర్‌పూర్‌ను చూసుకుంటూ ప్రయాణం అయోధ్య వైపు సాగుతుంది. ఆ రోజు అయోధ్యలోని పర్యాటక ప్రదేశాలను చూసి రాత్రి బస చేయాలి 

► పదవతేదీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి నైమిశారణ్యం వైపు సాగిపోవాలి. స్థానిక ఆలయాలను చూసుకుంటూ సాయంత్రానికి లక్నో చేరుస్తారు. ఆ రాత్రి లక్నోలో బస 

► పదకొండవ తేదీ బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి బారా ఇమాంబారా సందర్శనం తర్వాత అంబేద్కర్‌ మెమోరియల్‌ పార్క్‌ చూపించి ఏడు గంటలకు ఎయిర్‌పోర్టులో దించుతారు. ఏడు గంటల పది నిమిషాలకు లక్నోలో బయలుదేరిన ఇండిగో విమానం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్‌ చేరడంతో గంగా రామాయణ యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజ్‌లో... విమానం టికెట్‌లు, హోటళ్లలో నాలుగు రాత్రుల బస, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. సైట్‌ సీయింగ్‌కి ఏసీ బస్సుల్లో తీసుకెళ్తారు. ట్రావెల్‌ ఇన్సూరెన్స్, టూర్‌ ఎస్కార్ట్‌ సర్వీస్‌ ఉంటాయి. 

మరిన్ని వార్తలు