పిల్లలకు చొల్లు కారుతోందా..?

21 Jan, 2021 09:39 IST|Sakshi

చిన్న పిల్లలకు నోటి నుంచి చొల్లు కారుడం చాలా సహజం. నెలల వయసులో ఉన్నప్పుడు ఇలా చొల్లుకారడం కూడా చాలా అందంగా, మురిపెంగా ఉంటుంది. పిల్లల్లో ఇలా చొల్లు కారుతూ ఉండే కండిషన్‌ను వైద్య పరిభాషలో సైలోరియా అంటారు. చిన్నారుల్లో దాదాపు పద్దెమినిమిది నెలల వరకు చొల్లు కారడం జరుగుతుంది. వారి దవడలోని ఓరల్‌ మోటార్‌ ఫంక్షన్స్‌ అభివృద్ధి చెందవు కాబట్టి అలా జరుగుతుండటం మామూలే. అరుదుగా కొంతమంది పిల్లల్లో పద్దెనిమిది నెలల వయసు దాటాక కూడా తరచూ చొల్లు కారుతుంది. అలా జరుగుతుండటాన్ని సాధారణంగా తీసుకోడానికి మాత్రం వీల్లేదు. అలాంటి పిల్లలకు మానసిక సమస్యలుగాని, ఇతర నరాల సమస్యలు కారణం కావచ్చని అనుమానించాలి. 

చాలావరకు పిల్లల్లో చొల్లు కారడం అన్నది దానంతట అదే తగ్గిపోయే సమస్య అయితే కొందరు పిల్లల్లో చొల్లు కారడం మరింత ఎక్కువగా ఉంటే... దాన్ని ప్రత్యేకమైన డెంటల్‌ అప్లయెన్సెస్‌తో ఆ అలవాటు మాన్పించవచ్చు. పద్దెనిమిది నెలలు దాటాక కూడా చొల్లు వస్తుంటే పిల్లలను మీ పీడియాట్రిస్ట్‌కు గానీ లేదా సైకియాట్రిస్ట్‌కు గానీ చూపించాలి. 
 

మరిన్ని వార్తలు