క‌ళాకారుడు, ఈ అదృశ్య శిల్పం కాస్ట్ ఎంతో తెలుసా?!

13 Jun, 2021 11:55 IST|Sakshi

ఇక్కడ కనిపిస్తున్న శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. ఏంటీ వేళాకోళమా? లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలా? అని కన్నెర్ర చేయకండి. నిజమే ఇక్కడ శిల్పం లేదు. అలాగని వేళాకోళమూ కాదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! ఇటలీకి చెందిన సాల్వటోర్‌ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే  మనిషికి, అతని నిజమైన స్వభావానికీ రూపం ఉండదనే భావనతో  దానిని రూపొందించాడు.  అందుకే ఇదొక అదృశ్య శిల్పం. దీనిని ఓ ప్రత్యేక గదిలో  నిర్దిష్ట వాతవరణంలో భద్రపరుస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ శిల్పాన్ని ఓ వ్యక్తి పదమూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు కూడా. ఇదంతా వింటుంటే  గతంలో  86 లక్షల రూపాయల విలువ చేసిన ‘గోడ మీద టేపుతో అతికించిన అరటిపండు’ కళాకృతి కంటే క్రేజీగా ఉంది కదూ! 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు