ఈ మెట్రోబోగీలను శుభకార్యాలకు బుక్‌చేసుకొవచ్చు!

25 Mar, 2021 00:04 IST|Sakshi

ఆదాయం కోసం అదనపు మార్గాలు...అనే ప్రాజెక్ట్‌లో భాగంగా జైపూర్‌ మెట్రో కొత్త మార్గాన్ని కనిపెట్టింది. ఇకనుంచి ఈ మెట్రోరైల్లో సాధారణ ప్రయాణం చేయడమే కాదు బోగీలను పుట్టిన రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలకు బుక్‌ చేసుకోవచ్చు. 4 గంటలకు అయిదువేలు, మరికొంత అదనపు సమయం గడిపితే ఆరువేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు బోగీలను బుక్‌ చేసుకుంటే ఇరవై వేలు, అదనంగా సమయం గడిపితే  అయిదువేలు చెల్లించాలి.

ఇక్కడితో ఆగిపోలేదు. సినిమా షూటింగ్‌లు, వ్యాపార ప్రకటనల షూటింగ్‌లకు బోగీలను అద్దెకు ఇస్తున్నారు. బ్యానర్స్, షార్ట్‌టర్మ్‌ ఎడ్వరై్టజ్‌మెంట్‌లు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఆదాయానికి ఢోకా లేదన్నమాట!     

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు