సూట్‌కేస్‌లా కనిపిస్తుంది, కానీ సూట్‌కేస్‌ కాదు.. మరి ఏంటేంటే..

20 Nov, 2023 16:28 IST|Sakshi

ఇప్పటి దాకా పోర్టబుల్‌ గ్రిల్, పోర్టబుల్‌ స్టవ్, పోర్టబుల్‌ కుకర్‌ ఇలా చాలానే చూసుంటారు కానీ.. పోర్టబుల్‌ మైక్రోవేవ్‌ని చూశారా? లేటెస్ట్‌ వెర్షన్‌ గా వచ్చిన ఈ కుక్‌వేర్‌ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీన్ని ఓపెన్‌ చేసి సెట్‌ చేస్తే ఓవెన్‌లా.. ఫోల్డ్‌ చేసి లాక్‌ చేస్తే చిన్న సూట్‌కేస్‌లా ఉంటుంది. ఇది జపానీస్‌ టెక్నాలజీతో రూపొందింది.

బ్యాటరీతో పని చేస్తుంది. హ్యాండిల్‌ని వెనక్కి జరిపితే లాక్‌ ఓపెన్‌ అవుతుంది. అప్పుడు సూట్‌కేస్‌ ఓపెన్‌ అయ్యి.. ఓవెన్‌ లా మార్చుకోవడానికి వీలుంటుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చిత్రాల్లో చూడొచ్చు. అయితే ఈ మోడల్‌ వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. 

మరిన్ని వార్తలు