ఆభరణం: అభయం నీలి నేత్రం

16 Feb, 2021 15:46 IST|Sakshi

దేశాల అంతరాలు లేకుండా చెడు దృష్టి పడకుండా అడ్డుకునేందుకు మనిషి ప్రాచీన కాలం నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాటిలో ముఖ్యమైనది పెద్ద నీలిరంగు కనుగుడ్డు ఆకారం. ఇది మనకి హాని జరగాలని కోరుకునేవారిపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే నమ్మకంతో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఇదో ఆభరణంగా అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ డిజైన్స్‌కి ఏమాత్రం కొదవలేదన్నట్టుగా ‘నీలికన్ను’ దర్జా పోతోంది. ఇతర ఆభరణాలను ఒక్క చూపుతో కట్టడి చేస్తూ ట్రెండ్‌లో ముందంజలో ఉంటోంది. అదృష్టానికి చిహ్నంగా మారిపోయింది. 

ఆభరణాల విభాగంలో ఈవిల్‌ ఐ బ్రేస్‌లెట్, లాకెట్, ఉంగరం, చెవి పోగుల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది. వీటిలో పెద్ద, చిన్న పరిమాణంలో ఉన్నవి లభిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఫ్యాషన్‌ జ్యువెలరీలోనూ ఈవిల్‌ ఐ తన ప్రాధాన్యతను చాటుకుంటూనే ఉంది. ‘వినియోగదారులు వీటిని వ్యక్తిగత ఆభరణంగా ఎంపిక చేసుకుంటున్నారు’ అని ఆభరణాల నిపుణులు చెబుతున్న మాట. ఈవిల్‌ ఐ ఆభరణాన్ని తమ ఆత్మీయులకు మంచి జరగాలని కానుకగా కూడా ఇస్తున్నారు. 

మరిన్ని వార్తలు