చక్కనమ్మ బరువు పెరిగినా బ్రహ్మాండమే!

25 Mar, 2021 22:56 IST|Sakshi

ఇప్పుడు అందరి దృష్టి బరువు ఎలా తగ్గాలి, ఎలా స్లిమ్‌ కావాలి అనేదానిపైనే ఉంది. అయితే బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ ‘తలైవి’ సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కిలోల బరువు పెరగాల్సి వచ్చిందట. ‘అయినా అందంగానే ఉంది’ అని మురిసిపోయారు అభిమానులు. వారి అభిమానానికేం గానీ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి బాగానే చెమటోడాల్సి వచ్చింది కంగనా.

జయలలిత బయోపిక్‌ అంటే మామూలు విషయం కాదు...కొన్ని సీన్లలో చాలా గ్లామర్‌గా కనిపించాలి, కొన్ని సీన్లలో ఫైర్‌బ్రాండై గర్జించాలి, సమూహంలో ఒంటరిగా, ఒక్కరే మహా సమూహంగా...ఇలా ఎన్నో అవతారాల్లో ప్రేక్షకుల చేత శభాష్‌ అనిపించుకోవాలి. ఈ కష్టంతో పోల్చితే బరువు తగ్గడం అనేది చాలా ఈజీ అనడంలో తప్పు లేదేమో!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు