‘మీ ఎట్‌ 21’ వైరల్‌ ట్రెండ్‌

4 Feb, 2024 06:41 IST|Sakshi

వైరల్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘మీ ఎట్‌ 21’ వైరల్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా 21 ఏళ్ల వయసులోని తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో యూజర్‌లు పోస్ట్‌ చేస్తున్నారు. ఆ వయసులో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు.

అరిజోనా (యూఎస్‌) కు చెందిన 43 ఏళ్ల డామిన్‌ రఫ్‌ ఈ ట్రెండ్‌కు కారణం. మెక్సికోలో జరిగిన తన 21 వ బర్త్‌డే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.ఈ ఫోటో ‘ఇంతింతై... అంతంతై’ చివరికి వైరల్‌ ట్రెండ్‌గా మారింది.

 కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కాజల్‌లు కూడా ఈ వైరల్‌ ట్రెండ్‌లో భాగం అయ్యారు. కరీనా కపూర్‌ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘అశోక’ సినిమాలో షారుఖ్‌ఖాన్‌ పక్కన ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ ‘ఫీలింగ్‌ 21 దిస్‌ మార్నింగ్‌’ అనే కాప్షన్‌ ఇచ్చింది. మరో ఫోటోకు ‘21’ అని కాప్షన్‌ ఇచ్చి రెడ్‌ హార్ట్‌ ఇమోజీ జోడించింది. ప్రియాంక చోప్రా మోడలింగ్‌ రోజుల నాటి ఫోటోలను షేర్‌ చేసి ‘లెర్న్‌ ఏ లాట్‌ సిన్స్‌ దెన్‌’ అని కాప్షన్‌ ఇచ్చింది. బైక్‌పై కూర్చున్న తన ఫోటో షేర్‌ చేస్తూ ‘ఉయ్‌ డిడ్‌ వెల్‌. ప్యాట్‌ ఆన్‌ ది బ్యాక్‌ ఫర్‌ ది యంగర్‌ మీ’ అని కాప్షన్‌ ఇచ్చింది కాజల్‌.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega