కాశ్మీర్‌లో మహిళా కార్‌ ర్యాలీ

7 Oct, 2020 08:15 IST|Sakshi
కాశ్మీర్‌లో మొట్టమొదటి మహిళా మోటార్‌ రేసర్‌ డాక్టర్‌ షర్మీన్‌ ముష్తాక్‌ నిజామి 

జమ్మూ కశ్మీర్:‌ కశ్మీర్‌ మహిళా డ్రైవర్లు మొదటిసారి ఈ ఏడాది అక్టోబర్‌ 3న కారు ర్యాలీని నిర్వహించారు. ‘మేము ఇళ్ళు, కార్యాలయాలు సమర్థవంతంగా నడపగలిగినప్పుడు వాహనాలను నడపలేమా?’ అని ప్రశ్నిస్తున్నారు. మహిళా డ్రైవర్లకు సంబంధించిన అపోహలను తొలగించడానికి శ్రీనగర్‌ ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో ఒక ఎన్జీఓ మహిళా కార్‌ ర్యాలీని నిర్వహించింది. మహిళా డ్రైవర్లను గౌరవించటానికి వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ర్యాలీ జరుగుతోందని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న షేక్‌ సబా అన్నారు. ‘ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం మహిళలు ఉత్తమ డ్రైవర్లు కాదనే అపోహను తొలగించడమే. ర్యాలీలో పాల్గొన్న డాక్టర్‌ షర్మీల్‌ మాట్లాడుతూ ‘మహిళా డ్రైవింగ్‌ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఈ ర్యాలీలు క్రమం తప్పకుండా జరగాలి. చదవండి: శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ ఐజీగా చారు సిన్హా నియామకం

ఈ కార్యక్రమం మహిళా డ్రైవర్లను ప్రోత్సహిస్తుంది. ఇది మహిళా సాధికారతకు మూలం. ఇక్కడ ఇలాంటి ర్యాలీ జరగడం ఇదే మొదటిసారి’ అని ఆమె అన్నారు. కార్‌ ర్యాలీ నిర్వాహకుడు సయ్యద్‌ సిబ్బైన్‌ ఖాద్రి మాట్లాడుతూ ‘పురుష డ్రైవర్ల కంటే మహిళా డ్రైవర్లు తక్కువ ప్రమాదాలకు పాల్పడుతున్నారు. పురుషులతో పోల్చితే జాగ్రత్తలు తీసుకోవడంలో మహిళలే ముందుంటారు. మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడానికే ఈ ర్యాలీ చేపట్టాం’ అని ఖాద్రీ చెప్పారు. 

మరిన్ని వార్తలు