‘ఇలాంటి పిల్లల’కూ హక్కులుంటాయి!

17 Mar, 2023 02:37 IST|Sakshi

‘దివ్యాంగులు మెట్లు ఎక్కలేకపో వడానికి కారణం వాళ్లకు కళ్లో, కాళ్లో లేకపో వడం కాదు సమాజానికి సహానుభూతి లేకపో వడం’ అంటుంది తమిళ రచయిత్రి కంభంపా టి శ్రీలత.డిస్‌లెక్సియాతో పుట్టిన  కూతురి కోసం  తానే టీచర్‌గా మారింది శ్రీలత. ‘నార్మల్‌ వ్యక్తుల మెజారిటీ సమాజం దివ్యాంగుల పట్ల ఎటువంటి బాధ్యత వహించకపో యినా వాళ్లు తమ జీవితాలను నిశ్శబ్దంగా నిర్మించుకుంటూనే ఉంటారు’  అంటుందామె. కూతురి జీవితాన్ని, ఆమెలాంటి దివ్యాంగుల జీవితాలను ‘దిస్‌ కైండ్‌ ఆఫ్‌ చైల్డ్‌’ పుస్తకంగా తీసుకొచ్చిందామె.

శ్రీలత తాను రాసిన ‘దిస్‌ కైండ్‌ ఆఫ్‌ చైల్డ్‌’ పుస్తకాన్ని ఏడు అధ్యాయాలుగా విభజించింది. ఆ ఏడింటిలో ఒకదాని పేరు ‘దృష్టి లేనిది ఎవరికి?’. ‘ఈ సమాజంలో దృష్టి లేనిది అంధులకా దివ్యాంగుల పట్ల ఎటువంటి ఆలోచనా లేని సామాన్యులకా?’ అని ప్రశ్నిస్తుంది అందులో.‘సమర్థత (ఎబిలిటీ) మీకు మాత్రమే ఉంటుందా? అందుకే దివ్యాంగులను డిజేబుల్‌ అంటారా? వారూ సమర్థులే. కాని వారి కదలికలకు వీలు కల్పించలేని నిర్మాణాలు, చదవడానికి వీల్లేని చదువులు, వారికి సమాన అవకాశం ఇవ్వలేని స్కూళ్లు... ఇవి వారిని సమర్థత లేనివారుగా చేస్తున్నాయి’ అంటుందామె.

చెన్నైలో నివసించే శ్రీలత సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి. ఆమె రాసిన కవితా సంకలనాలు ఆదరణ పొందాయి. ‘టేబుల్‌ ఫర్‌ ఫోర్‌’ అనే నవల పెద్ద పురస్కారాల వరకూ వెళ్లింది. అయితే ఆ రాసిన పుస్తకాల కంటే తాజాగా వెలువరించిన ‘దిస్‌ కైండ్‌ ఆఫ్‌ చైల్డ్‌’ పుస్తకం విలక్షణమైనది. దానికి కారణం ఆమె కూతురు అనన్యకు 9 ఏళ్లు ఉండగా ‘ఇలాంటి అమ్మాయిని స్కూల్లో ఉంచుకోలేం’ అని ప్రిన్సిపల్‌ నిర్దాక్షిణ్యంగా చెప్పడమే.

ఆ ‘ఇలాంటి అమ్మాయి’ (దిస్‌ కైండ్‌ ఆఫ్‌ చైల్డ్‌)ని గుండెలకు హత్తుకుని తానే చదువు చెప్పుకుంది శ్రీలత. దానికి కారణం అనన్య డిస్‌లెక్సియాతో బాధ పడుతూ ఉండటమే. ఇంకా కచ్చితంగా చె΄్పాలంటే అనన్యకు ‘స్పెసిఫిక్‌ లెర్నింగ్‌ డిసేబిలిటీ’ (ఎస్‌ఎల్‌డి) ఉంది. ‘నా కూతురిని కూడా అందరి పిల్లలతో పా టు కూచోబెట్టి చదివించే స్కూళ్లు ఉండాలి. ఆ స్కూల్లో నా కూతురు స్థితిని స్వీకరించే పరిస్థితి ఉండాలి. నా కూతురే కాదు అలాంటి అందరు పిల్లలకు’ అంటుంది శ్రీలత.

‘న్యూరోడైవర్సిటీ’... అంటే మెదడు సంబంధమైన లోపా లతో పుట్టే పిల్లలు– ఆటిజమ్, డిస్ర్‌పా క్సియా, డిస్‌కాల్‌క్యులియా, డిస్‌గ్రాఫియా... తదితర అవస్థలతో బాధ పడుతుంటే వారి కోసం సమాజంలో ఎటువంటి ఆలోచనా ఉండదని ఈ పుస్తకంలో విపులంగా రాస్తుంది శ్రీలత.

వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి కంటే టీనేజ్‌కు వచ్చినప్పుడు ఎదురయ్యే మానసిక, శారీరక పరిస్థితుల గురించి చాలా అవగాహన లోపం ఉందని అంటుందామె. అందుకే తన పుస్తకంలో ‘మా షరతులతో మేము’ అనే చాప్టర్‌ను రాసింది. దివ్యాంగులు తమ పరిమితిని గుర్తించి ఆ పరిమితిని స్వీకరించి రాజీ పడక  హక్కుల కోసం పో రాడాలని కోరుతుందామె. ‘దివ్యాంగుల హక్కులు మానవ హక్కులు. మీరు జాలి పడి రాల్చే సౌకర్యాలు కాదు’ అంటుంది శ్రీలత.

దివ్యాంగుల విషయంలో అన్నింటి కంటే ముఖ్యమైన సమస్య ‘కేర్‌ గివర్స్‌’. అంటే ‘చూసుకునేవాళ్లు’. తల్లిదండ్రులు, భార్యాభర్తలు... వీరు దివ్యాంగులతో ఎలా మెలగాలో ఒక చాప్టర్‌లో రాస్తే తోబుట్టువులు, పిల్లలు ఎలా మెలగాలో ఇంకో చాప్టర్‌లో రాసింది. ‘పో లియోతో ఉన్న తండ్రితో నార్మల్‌గా పుట్టిన కొడుకు ఎలా మసలుకున్నాడో... తన తండ్రిని అర్థం చేసుకుని ఎలా బాసటగా నిలిచాడో ఒక కేస్‌స్టడీ ఈ పుస్తకంలో ఉంది’ అని చెబుతుంది శ్రీలత.

అనేక మంది దివ్యాంగుల గెలుపు కథలను, తల్లిదండ్రుల, తోబుట్టువుల, సహాయకుల, స్పెషల్‌ ఎడ్యుకేటర్ల అనుభవాలను కథలుగా, ఇంటర్వ్యూలుగా, మౌఖిక కథనాలుగా ఈ పుస్తకంలో రికార్డు చేసింది శ్రీలత. దివ్యాంగుల నిజమైన అవసరాలు ఏమిటో సమాజానికి రావాల్సిన దృష్టి ఏమిటో ఈ పుస్తకం సమర్థంగా తెలియచేస్తుంది. ‘ఇలాంటి పుస్తకాలు ఎంతమంది రాస్తే అంత మంచిది’ అంటుంది శ్రీలత.

అన్నింటి కంటే ముఖ్యం శ్రీలత కుమారుడు అనిరుద్ధ తన సోదరి అనన్యను చూస్తూ ‘ప్రతి స్కూల్లో పిల్లలకు దివ్యాంగుల గురించి పా ఠాలు చెప్పాలి. దివ్యాంగులతో ఎలా మెలగాలో పిల్లలకు సిలబస్‌గా ఎందుకు చెప్పరు? అప్పుడు కదా స్కూల్లో ఏ దివ్యాంగ పిల్లవాడైనా చేరితే ఇతర పిల్లలు అతనితో బాగా మెలిగేది’ అన్న మాట ఎంతో ఆలోచించదగ్గది.

మరిన్ని వార్తలు