Kitchen Tips: ఇనుప బాణలి, కళాయి తుప్పు పడితే ఇలా చేయండి! ఇక డీ ఫ్రై చేసేటపుడు..

26 Jul, 2022 12:43 IST|Sakshi

ఇనుప బాణలి, కళాయి, పెనం, ఇతర ఇనుముతో చేసిన కిచెన్‌ వస్తువులు తుప్పు పట్టి ఇబ్బంది పెడుతుంటాయి. తుప్పు పట్టిన ఇనుప బాణలిలో కొద్దిగా హార్పిక్‌ వేసి బాణలి అంతా రాసి గంటపాటు నానబెట్టాలి.

తరువాత స్టీల్‌ పీచుతో గట్టిగా రుద్దిన తరవాత డిష్‌ వాష్‌ లిక్విడ్‌ కూడా వేసి మరోసారి మెత్తటి పీచుతో రుద్ది కడగాలి. ఇలా కడిగిన బాణలిని తడిలేకుండా తుడిచి, నూనె రాసి ఆరనివ్వాలి. ఇలా చేస్తే ఇనుప వస్తువులు తుప్పు రాకుండా వాడుకోవడానికి చక్కగా పనికొస్తాయి.

ఇక పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్‌లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.

మరిన్ని టిప్స్‌
బంగాళదుంప ముక్కలను పదినిమిషాల పాటు మజ్జిగలో నానబెట్టి, తరువాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.

అదే విధంగా... డీప్‌ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే... కాగిన నూనెలో ముందుగా కొద్ది చింతపండు వేయాలి. తరువాత డీప్‌ ఫ్రై చేసుకుంటే నూనె పొంగదు.

పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి. పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.  

చదవండి: Veduru Kanji- Health Benefits: వెదురు కంజి.. టేస్టు అదుర్స్‌.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

మరిన్ని వార్తలు