మొక్కలు పెంచాలనుకుంటే చాలు.. అపార్ట్‌మెంట్‌లో కూడా పెంచొచ్చు!

10 Sep, 2023 10:24 IST|Sakshi

పట్టణాల్లోని చిన్న అపార్ట్‌మెంట్‌వాసుల నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం. కాని స్థలం ఎక్కడిది?’ ‘స్థలం పెద్దగా అక్కర్లేదు. పెంచాలనే సంకల్పం ఉంటే చాలు’ అంటుంది బిహార్‌కు చెందిన కమల్‌సింగ్‌. ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో ఉంటున్న కమల్‌సింగ్‌ తన చిన్న అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచుతుంది.

‘వంటగది వ్యర్థాలతో కంపోస్ట్‌ను ఎలా తయారుచేయాలి?’ అనే విషయం నుంచి ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వరకు... ఎన్నో విషయాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ‘అర్బన్‌ హోమ్‌ వైబ్స్‌’కు ఎంతోమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ‘స్టార్ట్‌ వేర్‌ యూ ఆర్‌ విత్‌ వాటెవర్‌ యూ హ్యావ్‌’ అంటున్న కమల్‌సింగ్‌ స్ఫూర్తితో ఎంతో మంది పట్టణ వాసులు తమ బాల్కనీలో మొక్కల పెంపకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ‘మేము సైతం’ అంటున్నారు. 

(చదవండి: వెరైటీగా బనానా ఆమ్లెట్‌ ట్రై చేయండిలా!)

మరిన్ని వార్తలు