బెండతో అనేక వ్యాధుల నివారణ

28 Aug, 2020 18:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని మధుమేహం(డయాబెటిస్‌), గుండె జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులు గడగడలాడిస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మధుమేహ బాధితులు ఇప్పుడు ప్రతి పల్లెలోనూ దర్శనమిస్తున్నారు. ముఖంగా పట్టణ ప్రాంత ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి, ఆహార నియమాలు పాటించక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధులతో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల వారు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు.

కాగా,  దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయల రారాజు బెండకాయ(లేడీ ఫింగర్‌)అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. బెండలో సీ,ఈ, కే, ఏ, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. కాగా, అధనంగా ఫైబర్‌, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మానవులకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. బెండ వల్ల కలిగే ప్రయోజనాలను విశ్లేషిద్దాం

బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకునే వారికి బెండ సంజీవనిగా పనిచేస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాలు లబించడంతో పాటు, బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు

డయాబెటిస్‌ను అదుపు చేయడం
బెండలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేది) చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మధుమేహాన్ని అదుపు చేసే మైరెసిటీన్‌ ఉంటుంది.  కాగా ఇది కండరాల ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది.

గుండె వ్యాధుల నియంత్రణకు
కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాద ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు (ఊబకాయం)తో బాధపడే వారికి బెండ మేలు మరువలేనిది. ముఖ్యంగా పెక్టిన్‌ అనే ఫైబర్‌ గుండె జబ్బులు కలగజేసే చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుందని అధ్యయానాల్లో తేలింది. మరోవైపు బెండలో ఉన్న పాలిఫినాల్స్‌ ఆర్టరీ బ్లాకులను నివారిస్తుంది.

క్యాన్సర్‌ నివారణకు
బెండలో ఉన్న లెక్టిన్‌ రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను 65శాతం మేర నివారిస్తుందని ఇటీవలే ఓ బయోటెక్నాలజీ నివేదిక తెలిపింది. మరోవైపు బెండతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి

అందమైన చర్మం కోసం
బెండలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, కెరటోనాయిడ్స్‌ పదార్థం లభించడం వల్ల వయస్సు తక్కువగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చెడు చర్మ గ్రంథులను తొలగించే శక్తి బెండలో ఉన్నాయి

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి
బెండలో ఉన్న డయిటరీ ఫైబర్‌ వల్ల మలబద్దకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణశక్తికి బెండ ఎంతో మేలు చేస్తున్నట్లు అధ్యయనాలున్నాయి

బెండతో గర్భిణి స్త్రీలకు ఎంతో మేలు
బెండకాయను గర్భిణి స్త్రీలు నిత్యం తినడం వల్ల గర్భిణిలకు అతిముఖ్యమైన ఫోలేట్‌(విటమిన్‌ 9) పోషకం లభిస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల కొత్తగా జన్మించే శిశువులకు జన్యుపరమైన నరాల జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుదల
బెండను నిత్యం మన ఆహార అలవాట్లలో వాడడం వల్ల మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బెండలో అత్యధికంగా లభించే విటమిన్‌ సీ వల్ల భయంకరమైన వైరస్‌(కరోనా వైరస్‌) లను ఎదుర్కొవచ్చు. రుచి కోసం చూసుకోకుండా బెండను నిత్యం వాడడంతో ఎన్నో భయంకరమైన రోగాలను నివారించవచ్చు
 

మరిన్ని వార్తలు