జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా? ఇకపై నో టెన్షన్‌

20 Nov, 2023 13:25 IST|Sakshi

జుట్టు రాలిపోవడం.. నిర్జీవంగా మారిపోవడం.. ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. దీనికి పరిష్యారమే ఈ ఎల్‌ఈడీ హెయిర్‌ గ్రోత్‌ థెరపీ కోంబ్‌. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అలాగే తలకు రిలాక్సింగ్‌ మసాజర్‌లానూ పని చేస్తుంది. 3 రకాల వైబ్రేషన్‌ మసాజ్‌ ఆప్షన్స్‌తో ఇది రూపొందింది.

ఈ ఎల్‌ఈడీ లైట్లు రెడ్‌ అండ్‌ బ్లూ కలర్‌లో ఉంటాయి. రెడ్‌ కలర్‌.. జుట్టు దృఢత్వానికి, పెరుగుదలకు ఉపయోగపడితే.. బ్లూ కలర్‌ .. స్కాల్ప్‌ ఇరిటేషన్, ఆయిల్‌ కంట్రోల్‌ వంటివి సరిచేస్తుంది. దీనిలోని 49 హెడ్‌ మసాజ్‌ బ్రిసల్స్‌ రక్త ప్రసరణను మెరుగుపరచే చికిత్సను అందిస్తుంటాయి.

మసాజ్‌ని ప్రారంభించడానికి ఎమ్‌ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. లైట్‌ మోడ్‌ని ఆన్‌ చేయడానికి లైట్‌ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. అవసరమైన కలర్‌ ఎంపికతో నచ్చే మసాజ్‌ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఈ డివైస్‌ను అచ్చం సాధారణ దువ్వెనలా ఉపయోగించుకోవచ్చు. మెడ, చెవి వెనుకవైపు నుంచి జుట్టును దువ్వుకున్నప్పుడు ఈ మసాజర్‌తో మంచి ఫలితాలుంటాయి. దీన్ని స్త్రీ, పురుషులు ఇరువురూ వాడుకోవచ్చు.

అన్ని రకాల ఆయిల్స్‌ అప్లై చేసుకుని కూడా ఈ మసాజర్‌ను వినియోగించుకోవచ్చు.ఈ ఎల్‌ఈడీ దువ్వెన.. పోర్టబుల్‌ అండ్‌ లైట్‌ వెయిట్‌. చార్జింగ్‌ పెట్టుకుని.. వైర్‌లెస్‌గానూ యూజ్‌ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్‌ చేయడానికి కాటన్‌ లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. ఇది ట్రావెల్‌ ఫ్రెండ్లీ కావడంతో.. ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర సుమారుగా రెండువేల రూపాయలు. 

మరిన్ని వార్తలు