ముఖారవిందానికి పప్పుల ఫేస్‌ ప్యాక్స్‌! 

30 Oct, 2021 10:50 IST|Sakshi

ముఖం అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రసాయన క్రీములన్నీ వాడేస్తుంటారు. ఇవి కొన్నిసార్లు దుష్ప్రభావాలు చూపించి ఉన్న అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. అయితే ఎటువంటి రసాయనాలు వాడకుండా మనింట్లో ఉండే పప్పులతో ఫేస్‌ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.. 

శనగపప్పు
మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. 

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..


 

మసూర్‌దాల్‌
కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్‌) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్‌ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. 
 

పెసరపప్పు
అరకప్పు పెసరపప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్టులా రుబ్బుకోవాలి. దీనికి టేబుల్‌ స్పూను పెరుగు, టేబుల్‌ స్పూన్‌ అలోవెరా జెల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తరువాత నీటితో మర్దన చేసి, కడిగేయాలి. ఈ ప్యాక్‌తో విటమిన్‌ ఏ, సీలు ముఖారవిందాన్ని మరింత మెరిపిస్తాయి. 

చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!

మరిన్ని వార్తలు