అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!!

4 Oct, 2021 12:38 IST|Sakshi

అడవిలో పక్షులు, జంతువులకు వేటి సహజ అలవాట్లు వాటికుంటాయి. అందుకు ప్రత్యేకంగా ఏదైనా చేస్తేనే అది వండర్‌ అవుతుంది. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులైతే మామూలే అనుకోవచ్చు. కానీ అడవికే రారాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే సందేహం కలిగేలా ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అసలేంచేసిందంటే..

ఒక కదులుతున్న కారులో నుంచి ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో కారు పబ్లిక్‌ టాయిలెట్‌ దగ్గర ఆగగానే లోపల్నుంచి బయటకు వస్తున్న సింహం కనిపిస్తుంది. వాళ్లను చూసిన సింహం ‘ఇది నాకు చాలా మామూలు విషయం’ అన్నట్టుగా నింపాదిగా బయటికి వచ్చి అడవిలోకి వెళ్లిపోతుంది.

ఐతే ఈ సంఘటన ఎక్కడజరిగిందో తెలియదు కానీ దీనిని చూసిన నెటిజన్లు మాత్రం భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘మగ సింహం జంట్స్‌ టాయిలెట్స్‌ నుంచి బయటికి రావడం నిజంగా అభినందించదగిన విషయమే.. చదువుకున్న సింహం’ అని ఒకరు కామెంట్‌ చేస్తే, ‘చాలా సేపటినుంచి ఓపిక పట్టాను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని’ మరొకరు కామెంట్‌ చేశారు.

పబ్టిక్‌ టాయిలెట్స్‌లో జంతువులు కనిపించడం ఇది మొదటిసారేమీ కానప్పటికీ జంగిల్‌ సఫారీ టైంలో టాయిలెట్లకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించి వెళ్లడం బెటర్‌ అనిపిస్తుంది ఈ వీడియోను చూస్తే! దీంతో ఈ వీడియోను వేలకొద్దీ నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

చదవండి: చరిత్రలో పెద్ద మిస్టరీగా మిగిలిన మృత్యులోయ..!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు