-

ఈ చైర్‌లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!

26 Nov, 2023 13:23 IST|Sakshi

శరీరంలో ఏ భాగం పెరిగినా.. తగ్గినా పెద్దగా తేడా ఉండదు కానీ పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరితే మాత్రం మొత్తం శరీరాకృతే మారిపోతుంది. అందుకే మొదట పొట్ట తగ్గించుకోవాలి అనుకునేవారు.. ఇలాంటి బ్యాలెన్స్‌ చైర్‌ని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వ్యాయామ పరికరం.. నడుము, తొడభాగాలను తగ్గించడంతో పాటు ఉదర కండరాలను దృఢంగా మారుస్తుంది. దీనిపై కూర్చున్నప్పుడు అటూ ఇటూ ఒరిగేందుకు వీలుగా రూపొందింది ఇది.

దీని కింద అమర్చుకోవడానికి ఒక గుండ్రటి రింగ్‌ కూడా లభిస్తుంది. అలాగే ఇరువైపులా సపోర్టింగ్‌ కోసం హ్యాండిల్స్‌ ఉంటాయి. నిజానికి ఆ హ్యాండిల్స్‌ లేకుండా కూడా ఇందులో కూర్చుని బాలెన్స్‌ చేసుకోవచ్చు. ఈ చైర్‌లో కూర్చుని.. ప్రతిరోజూ వ్యాయామం చేసినట్లయితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. శరీర సౌష్టవాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ చైర్స్‌ మార్కెట్‌లో రెడ్, బ్లాక్, బ్లూ, పింక్, ఆరెంజ్‌ వంటి రంగుల్లో దొరుకుతున్నాయి. ధర 152 డాలర్లు. అంటే 12,647 రూపాయలు.  

(చదవండి: ఇంట్లోనే ఈజీగా మసాజ్‌ చేయించుకోవచ్చు ఇలా..!)

మరిన్ని వార్తలు