ఈ రాయి పేరు లవ్‌రాక్‌ ఎందుకంటే...

17 Apr, 2021 12:45 IST|Sakshi

రాజస్థాన్‌లోని హిల్‌స్టేషన్‌ మౌంట్‌ అబూ. ఈ కొండ మీద పెద్ద సరస్సు, పేరు నక్కీ లేక్‌. ఈ సరస్సును చుట్టినట్లున్న రోడ్డు వెంట ముందుకు వెళ్తే... హనీమూన్‌ స్పాట్‌కు చేరుతాం. అక్కడ కొండ రాయి పేరు లవ్‌రాక్‌. ఈ పేరు ఎందుకంటే... దూరం నుంచి చూస్తే ఒక అబ్బాయి, అమ్మాయిని ఆలింగనం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రేమికులకు ప్రకృతి కల్పించిన ఏకాంత సౌధం ఇది. ఆ రాయి దగ్గర జంట ఏకాంతంగా కూర్చుని మౌంట్‌ అబూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించవచ్చు.

సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి కూడా ఇది చక్కటి పాయింట్‌. సూర్యుడు త్రీడీ ఎఫెక్ట్‌లో ముందుకు జరుగుతూ మనకు దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే మౌంట్‌ అబూ టూర్‌ ప్యాకేజ్‌లో చూపించే సన్‌సెట్‌ పాయింట్‌ ఇది కాదు. మౌంట్‌ అబూలో మరో సన్‌సెట్‌ పాయింట్‌ కూడా ఉంది. ఈ రాయి ఏ ఆధారమూ లేకుండా గాల్లో నిలిచి ఉండడంతో అనాధార శిఖరం  అంటారు. మౌంట్‌ అబూ ఉన్నది రాజస్థాన్‌ రాష్ట్రంలోనే అయినా, విమానంలో వెళ్లే వాళ్లు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగడమే సౌకర్యం. అక్కడి నుంచి మౌంట్‌ అబూ 225 కిమీల దూరం.

( చదవండి:  ఐదేళ్ల చిన్నారి.. రీడింగ్‌ రికార్డు  

మరిన్ని వార్తలు