ఇక చంద్రుడి మీద డుగ్గు డుగ్గు.. ‘నాసా’ కొత్త తరహా బుల్లెట్టు

7 Nov, 2021 10:32 IST|Sakshi

Lunar electric motorcycle for NASAs moon exploration: చంద్రుడి మీద చక్కర్ల కోసం...చంద్రుడి మీద మనిషి అడుగుపెట్టి దశాబ్దాలు గడిచాయి గాని, ఇంతవరకు చంద్రుడి మీద ఎవరూ మోటారు సైకిల్‌ ఎక్కి చక్కర్లు కొట్టలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికే అమెరికన్‌ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కొత్త తరహా బుల్లెట్టు బండిని రూపొందించింది. ఈసారి చంద్రుడి మీదకెళ్లినప్పుడు రాకెట్‌తో పాటు ఈ బుల్లెట్టు బండిని కూడా తీసుకుపోతే, ఇంచక్కా చంద్రుడి నేల మీద డుగ్గు డుగ్గుమని చక్కర్లు కొట్టి రావచ్చు.

పూర్తిగా ఎగుడు దిగుళ్లతో నిండి ఉండే చంద్రుడి ఉపరితలంపై సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా ‘నాసా’ శాస్త్రవేత్తలు బ్యాటరీతో నడిచే ఈ మోటారుబైక్‌ను తయారు చేశారు. ఈ వాహనం బరువు 134 కిలోలు. దీని బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేసుకుంటే, చంద్రుడి ఉపరితలంపై ఏకధాటిగా 70 మైళ్ల వరకు (112 కి.మీ.) ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠవేగం 10 మైళ్లు (16 కి.మీ.) మాత్రమే.

చదవండి: T20 World Cup 2021: ఆ జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి పోరు.. టీమిండియా పరిస్థితి ఏంటో!

మరిన్ని వార్తలు