ప్రజలను ఉద్దేశించి ధర్మరాజు ఏమన్నాడు?

4 Nov, 2020 06:23 IST|Sakshi

ప్రశ్నోత్తర భారతం

31. పాండవులు వారణావతానికి బయలుదేరుతూ ఏం చేశారు?
32. పాండవులు వారణావతానికి బయలుదేరుతుండగా హస్తిన ప్రజలు ఏమనుకున్నారు?
33. ప్రజలను ఉద్దేశించి ధర్మరాజు ఏమన్నాడు?
34. పాండవులను వారణావతానికి ఏవిధంగా సాగనంపారు?

జవాబులు
31. ధృతరాష్ట్రునికి, భీష్మద్రోణాదులకు వందనం చేసి, వారి అనుమతి పొందారు; 32.శంతనుడు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు, పాండురాజు... వీరంతా వరుసగా పరిపాలించారు. ఆ క్రమంలో ధర్మరాజు రాజు కావాలి. ధృతరాష్ట్రుడు ధర్మం తప్పాడు. పాండవులను వారణావతానికి పంపుతున్నారు. ఇది అధర్మం. మనం కూడా ధర్మరాజుతో వారణావతానికి వెళదాం... అంటూ పాండవుల వెంట బయలుదేరారు; 33. ప్రజలారా! ధృతరాష్ట్రుడు మాకు తండ్రి. ఆయన చెప్పినట్లు చేయటం మా విధి. మీరు వెనక్కు వెళ్లిపోండి.. అని వారి వద్ద సెలవు తీసుకున్నారు; 34.  ధర్మరాజాదులను కన్నీటితో సాగనంపారు.
– నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు