భీముని మాటలకు ధర్మరాజు ఏమన్నాడు?

9 Nov, 2020 07:41 IST|Sakshi

ప్రశ్నోత్తర భారతం

40. పాండవులు వారణావతంలో ఉన్నప్పుడు ఏం జరిగింది?
41. ఇల్లు చూసిన పాండవులు ఏ విధంగా ఉన్నారు?
42. ధర్మరాజు ఎలాంటివాడు?
43. ఇంటి గురించి ధర్మరాజు భీమునితో ఏమన్నాడు?
44. ధర్మరాజు మాటలకు భీముడు ఏమన్నాడు?
45. భీముని మాటలకు ధర్మరాజు ఏమన్నాడు?
46. పురోచనుడు గ్రహిస్తే ఏం జరుగుతుందని ధర్మరాజు అన్నాడు?
47. ఎవరెవరు ఎటువంటి వారికి అపాయం కలిగిస్తారని ధర్మరాజు అన్నాడు?
48. దుర్యోధనుడి గురించి ధర్మరాజు ఏమన్నాడు?
49. పాండవులు ఏ విధంగా జీవనం సాగించారు?

జవాబులు
40.  కొంతకాలం పాండవులు రాజగృహంలో ఉన్నారు. అప్పుడు పురోచనుడు లక్క ఇల్లు పూర్తి చేసి, ఆ విషయం పాండవులకు విన్నవించాడు.  41.  పాండవులు అక్క ఇల్లు చూసి సంతోషించారు. పురోచనుడు శిల్పాచార్యుడు. అతడిని పూజించారు. పుణ్యాహవాచనం చేసి, లక్క ఇంట్లోకి ప్రవేశించారు. 42.  మాయోపాయాలు తెలుసుకోగల సమర్థుడు. అతడు లక్క ఇంటి రహస్యం కనిపెట్టాడు. విషాగ్నుల వలన భయమని విదురుడు చెప్పిన మాటలు తలచుకున్నాడు. 43. పురోచనుడు లక్క ఇల్లు కాల్చగలడని చెప్పాడు.  44. తక్షణమే ఇంటి నుంచి బయటపడటం మేలని భీముడు అన్నాడు. 45. మనం పురోచనుని గుట్టు తెలుసుకున్నట్లు అతడు గ్రహించకూడదు.  46. పురోచనుడు గ్రహిస్తే, ఈ ఇంటిని మరింత తొందరగా దహిస్తారు. మనం మరొక చోటికి వెళితే దుర్యోధనుడు మనకు తప్పక అపాయం కలిగిస్తాడు.. అన్నాడు. 47. ప్రభుత్వ బలం ఉన్నవాడు ప్రభుత్వ బలం లేనివానికి, భుజబలం ఉన్నవాడు భుజబలం లేనివానికి, ధనవంతుడు ధనం లేనివానికి, రసజ్ఞుడు రసజ్ఞత లేనివానికి సునాయాసంగా అపాయం కలిగించగలరు... అని వివరించాడు. 48. దుర్యోధనుడు దుర్మార్గుడు. అతడికి ప్రభుత్వం బలం ఉంది. కాబట్టి మనం పారిపోకూడదు. అప్రమత్తులమై ఇక్కడే ఉండాలి. ఈ విషయం తెలియనట్లు ప్రవర్తించాలి. లక్క ఇల్లు కాలేంతవరకు ఇక్కడే ఉండాలి.. అన్నాడు. 49.  పాండవులు పగటిపూట అడవులకు వెళ్లి వేటాడారు. రాత్రుళ్లు ఆయుధాలు ధరించారు. అప్రమత్తంగా ఉంటూ కొంతకాలం గడిపారు.   – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ 

మరిన్ని వార్తలు