డ్రైఫ్రూట్స్‌ నగల ధగధగలు

18 Feb, 2024 06:34 IST|Sakshi

వైరల్‌

ఫంక్షన్‌లో పదిమంది దృష్టి పడేలా ప్రత్యేకంగా కనిపించాలనుకోవడం సహజం. మేకప్‌ ఆర్టిస్ట్‌ వసుంధర మరింత ప్రత్యేకంగా కనిపించాలని డిసైడై ‘డ్రై ఫ్రూట్స్‌ జ్యూలరీ’ ధరించింది. యూనిక్‌ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసింది. మాంగ్‌ టిక్క, గాజులు, జూకాలు, వడ్డాణం... ఇలా అన్నీ డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసినవే.

ఫంక్షన్‌ తరువాత డ్రైఫ్రూట్స్‌ను రీయూజ్‌ చేస్తారా, పారేస్తారా అనేది మాత్రం తెలియదు. ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వేలాది లైక్‌లతో వైరల్‌ అయింది. ‘భలే ఉన్నారు’ అనే ప్రశంసలతో పాటు ‘వేస్టేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌’లాంటి కామెంట్స్‌ కనిపించాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు