ఇచట చెట్లకు డబ్బులు కాయబడును!

18 Feb, 2024 05:58 IST|Sakshi

వైరల్‌

ఈ వైరల్‌ వీడియోను చూసిన వాళ్లు ‘చెట్లకు డబ్బులు కాస్తాయా!’ అనే సామెతకు ‘భేషుగ్గా’ అని జవాబు చెప్పవచ్చు. 2.8 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియోలో రాయితో కొట్టి చెట్టు నుంచి ప్రజలు కాయిన్స్‌ తీసుకోవడం కనిపిస్తుంది. ‘సీయింగ్‌ ఈజ్‌ బిలీవింగ్‌’ అనే మాట నిజమేగానీ ‘ఇదెలా సాధ్యం?’ అనే ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిలబడుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే బిహార్‌లోని రాజ్‌గిర్‌ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు బెరడు తీసి అందులో నాణెం పెడితే శుభం జరుగుతుందనే సెంటిమెంట్‌ ఉంది. ఈ సెంటిమెంట్‌ పుణ్యమా అని చెట్టులో ఎటు చూసినా డబ్బులే డబ్బులు! అదృష్టం కోసం ఇంట్లో ‘మనీ ప్లాంట్‌’ పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఈ వీడియోను చూసిన తరువాత మాత్రం ‘ఇదే అసలు సిసలు మనీప్లాంట్‌’ అంటున్నారు నెటిజనులు.

whatsapp channel

మరిన్ని వార్తలు