వ్యర్థం నుంచి అర్థం..రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు?

24 Jan, 2023 17:47 IST|Sakshi

భవన నిర్మాణ వ్యర్థాలతో కంకర, ఇటుకల తయారీ

2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేతలో వెలువడిన నిర్మాణ వ్యర్థాలు 1,46,000 మెట్రిక్‌ టన్నులు. వీటన్నింటినీ ఏం చేయాలి? పెద్ద సమస్య! హైదరాబాద్‌లోనే భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ఉండటంతో అక్కడకు తరలించారు.

2022లో నోయిడాలోని సూపర్‌టెక్‌ ట్విన్‌ టవర్స్‌ను  కూల్చివేసినప్పుడు వెలువడిన వ్యర్థాలు 30,000 మెట్రిక్‌టన్నులు. వాటినేం చేయాలి ? అక్కడ ఉన్న  ప్లాంట్‌కు తరలిస్తూ రీసైక్లింగ్‌ చేస్తున్నారు.  

హైదరాబాద్‌లో కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయాన్ని కూల్చివేస్తే, నోయిడాలో అక్రమ నిర్మాణం జరిపినందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చేశారు. 

ఇలా పెద్ద పెద్ద భవంతులే కాదు ఏ రకమైన నిర్మాణాలను కూల్చివేసినా, లేదా కొత్తగా నిర్మాణాలు చేపట్టినా నిర్మాణ ప్రక్రియలోను, కూల్చివేతల తర్వాత వ్యర్థాలు వెలువడటం తెలిసిందే. 

ప్లాస్టిక్‌ మాదిరిగానే వీటిని కూడా రీసైక్లింగ్‌ చేసి పునర్వినియోగించేందుకు సీ అండ్‌ డీ వేస్ట్‌ 
(నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల) రీసైక్లింగ్‌ ప్లాంట్స్‌ ఉపయోగపడుతున్నాయి. 

ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్‌ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్‌ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. 

హైదరాబాద్‌లో సీ అండ్‌ డీ వేస్ట్‌ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను  హైదరాబాద్‌ సీ అండ్‌ డీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్‌ అండ్‌ కాంట్రాక్టర్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీస్‌గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్‌పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్‌లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్‌  నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్‌ డీ వ్యర్థాలను సేకరిస్తోంది.

రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు?
శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి గ్రీన్‌ అండ్‌ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు.  దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్‌ వాషింగ్‌ అండ్‌ క్రషింగ్‌తో  ‘వెట్‌ప్రాసెస్‌’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్‌కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్‌ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్‌లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. 

ఇసుక, మెటల్, కంకరలను యాడ్‌మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్‌బ్లాక్‌లు, కెర్బ్‌స్టోన్‌, టైల్స్, ప్రీకాస్ట్‌ వాల్స్‌ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్‌ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్‌ ఫిల్లింగ్‌కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్‌స్కేపింగ్‌ పనులకు వాడవచ్చు. సిల్ట్‌ను ల్యాండ్‌ఫిల్లింగ్‌కు వాడవచ్చు. వేస్ట్‌ ప్రాసెసింగ్, ప్రొడక్షన్‌  అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు.

దేశంలో రీసైక్లింగ్‌ ఒక్క శాతమే..
దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్‌ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్‌ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ  టన్నులు కాగా 1.80 మిలియన్‌  టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్‌ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి.  మొత్తం సీ అండ్‌ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అవుతోంది.

హైదరాబాద్‌లో రోజుకు 2200 టన్నుల సీ అండ్‌ డీ వ్యర్థాలు..
గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌  (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్‌ టన్నుల సీ అండ్‌ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. 
ఒక్కోప్లాంట్‌ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్‌ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్‌ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్‌ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్‌ టన్నుల సేకరణ జరుగుతోంది. 

గత నవంబర్‌ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్‌ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. 

జీహెచ్‌ఎంసీలో  ఇలా..
జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్‌ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటా¯Œ చెరువు, మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్‌ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్‌కు తరలిస్తారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, అంబర్‌పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్‌ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ ఫో¯Œ నంబర్‌: 18001201159, వాట్సాప్‌ నంబర్‌: 9100927073. 
చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్‌ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్‌ సెంటర్‌కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్‌పేట దగ్గరి తూముకుంట సెంటర్‌కు తరలిస్తారు. 
టోల్‌ఫ్రీ నంబర్‌ 18002030033కు ఫోన్‌ చేసి, లేదా వాట్సాప్‌నంబర్‌ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. 

ఎంత ఫీజు..
వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్‌కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్‌ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్‌పేట:రూ.435, శంషాబాద్‌:రూ.405. 
ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్‌ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
∙ సిహెచ్‌ వెంకటేశ్‌

నైపుణ్యంతో నాణ్యమైన ఉత్పత్తులు..
నైపుణ్యాలను పెంచుకుంటూ ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌’ సీ అండ్‌ డీ వ్యర్థాలతో నాణ్యమైన, మన్నిక కలిగిన, విలువైన ఉత్పత్తుల్ని చేస్తోంది. మా కంపెనీకి చెందిన ఆరు కేంద్రాల ద్వారా ఏటా 3,10,985 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను 92 శాతం రీసైక్లింగ్‌ సామర్థ్యంతో ప్రాసెసింగ్‌ చేస్తున్నాం. ఈ సంవత్సరం మరో రెండు కేంద్రాలు పని ప్రారంభించనున్నాయి. ఈ రంగంలో గడించిన అనుభవంతో వేస్ట్‌ను ఆదాయ వనరుగా మారుస్తున్నాం. గత సంవత్సరం పేవర్‌బ్లాకులు, కెర్బ్‌స్టో¯Œ ్స, ఇటుకలతో సహా మొత్తం 1,83,561 యూనిట్లను ఉత్పత్తి చేశాం. నోయిడాలో సూపర్‌టెక్‌ ట్వి¯Œ టవర్స్‌ కూల్చివేతలో వెలువడిన 30వేల టన్నుల సీ అండ్‌ డీ వ్యర్థాలను రీసైక్లింగ్‌తో నాణ్యమైన నిర్మాణ ఉత్పత్తులుగా మారుస్తున్నాం. రీసైక్లింగ్‌ ద్వారా మెరుగైన ఉత్పత్తులతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్‌ను అందజేస్తున్నాం. రోజురోజుకూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. సర్క్యులర్‌ ఎకానమీని ప్రమోట్‌ చేస్తున్నాం. 
– గౌతమ్‌రెడ్డి, ఎండీ, రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌. 

జాతికి మేలు జరగాలని.. 
మూడు  దశాబ్దాలకుపైగా భవనాలు, బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణరంగంలో ఉన్న మా సంస్థ ద్వారా ప్రజలకు, పర్యావరణానికి మేలు చేయాలనే తలంపుతో ఈ రంగంలోకి ప్రవేశించాం. పునరుత్పత్తులపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఏమైనా చేయవచ్చుననే నమ్మకం ఉంది. వేల టన్నులతో గుట్టలుగా పేరుకుపోతున్న సీ అండ్‌ డీ వ్యర్థాలతో ఎన్నో అనర్థాలున్నాయి. చెరువుల్లో నింపుతున్నందున చెరువులు కనుమరుగవుతున్నాయి. సీ అండ్‌ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌ ఎందుకు జరగడం లేదా అని ఎన్నో ఏళ్లనుంచి ఆలోచిస్తున్నాం. దేశంలోని వివిధ నగరాల్లో రెండు సంవత్సరాలు పరిశోధన చేశాం. ఆయా నగరాల్లో రీసైక్లింగ్‌ ప్లాంట్ల పనితీరు పరిశీలించాం. చేయగలమనే నమ్మకంతో ఈ రంగంలోకి దిగాం. ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలకు తగిన అవగాహన కలిగేలా విస్తతంగా ప్రచారం  చేయాల్సి ఉంది. ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పునరుత్పత్తులను ప్రోత్సహించాలి. భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలోనే అధికారులు ఈ ఉత్పత్తుల గురించి తెలియజేయాలి.
– సోమ శ్రీనివాసరెడ్డి, ఫౌండర్, ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ

ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్‌ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్‌ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. 

హైదరాబాద్‌లో సీ అండ్‌ డీ వేస్ట్‌ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను  హైదరాబాద్‌ సీ అండ్‌ డీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్‌ అండ్‌ కాంట్రాక్టర్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీస్‌గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్‌పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్‌లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్‌ నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్‌ డీ వ్యర్థాలను సేకరిస్తోంది.  

రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు?
శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి గ్రీన్‌ అండ్‌ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు.  దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్‌ వాషింగ్‌ అండ్‌ క్రషింగ్‌తో  ‘వెట్‌ప్రాసెస్‌’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్‌కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్‌ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్‌లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. 

ఇసుక, మెటల్, కంకరలను యాడ్‌మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్‌బ్లాక్‌లు, కెర్బ్‌స్టోన్‌, టైల్స్, ప్రీకాస్ట్‌ వాల్స్‌ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్‌ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్‌ ఫిల్లింగ్‌కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్‌స్కేపింగ్‌ పనులకు వాడవచ్చు. సిల్ట్‌ను ల్యాండ్‌ఫిల్లింగ్‌కు వాడవచ్చు. వేస్ట్‌ ప్రాసెసింగ్, ప్రొడక్ష¯Œ  అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు.

దేశంలో రీసైక్లింగ్‌ ఒక్క శాతమే..
దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్‌ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్‌ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ  టన్నులు కాగా 1.80 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్‌ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి.  మొత్తం సీ అండ్‌ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అవుతోంది.

హైదరాబాద్‌లో రోజుకు 2200 టన్నుల సీ అండ్‌ డీ వ్యర్థాలు..
గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్‌ టన్నుల సీ అండ్‌ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. 
ఒక్కోప్లాంట్‌ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్‌ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్‌ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్‌ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్‌ టన్నుల సేకరణ జరుగుతోంది. 
గత నవంబర్‌ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్‌ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. 

జీహెచ్‌ఎంసీలో  ఇలా..
జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్‌ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటాన్‌ చెరువు, మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్‌ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్‌కు తరలిస్తారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, అంబర్‌పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్‌ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ ఫోన్‌ నంబర్‌: 18001201159, వాట్సాప్‌ నంబర్‌: 9100927073. 
చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్‌ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్‌ సెంటర్‌కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్‌పేట దగ్గరి తూముకుంట సెంటర్‌కు తరలిస్తారు. 
టోల్‌ఫ్రీ నంబర్‌ 18002030033కు ఫోన్‌ చేసి, లేదా వాట్సాప్‌నంబర్‌ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. 

ఎంత ఫీజు..
వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్‌కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్‌ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్‌పేట:రూ.435, శంషాబాద్‌:రూ.405. 
ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్‌ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
∙ సిహెచ్‌ వెంకటేశ్‌

మరిన్ని వార్తలు