బిడ్డను చంకనెత్తుకుని... ఊరంతా వెతికాడట!

19 Jan, 2024 16:17 IST|Sakshi

నెత్తిన కళ్లజోడు పెట్టుకుని.. అయ్యో నా కళ్ల జోడు  అని వెతుక్కోవడం.. తాళాలు చేత్తో పట్టుకొని  తాళాలు  కోసం  తెగ ఖంగారు పడి పోవడం మనలో చాలా మందికి  అనుభవమే. అంతేకాదు ఒక్కోసారి ఫోన్‌ మాట్లాడుతూనే.. నా ఫోన్‌ ఏది అని గాభరా పడిపోతూ ఉంటాం కదా. మడి సన్నాక.. అయోమయం, మతిపరుపు కామన్‌ అంటారా? అయితే సరే.. ఈ వైరల్‌ వీడియో చూడండి..ఎండింగ్‌ అస్సలు మిస్‌ కాకూడదు మరి!

ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బేబీ స్క్రోలర్‌లో బేబీ లేకపోవడంతో ఒక్కసారి కంగారు పడిపోయాడు. అటూ ఇటూ వెదుకుతూ తెగ ఆందోళన చెందాడు. తీరా .. చూస్తే  ఆ పాపను  భుజంపైన ఎత్తుకోవడం కనిపిస్తుంది.  చివరికి  అసలు సంగతి తెలుసుకున్న తరువాత  తండ్రి రియాక్షన్‌ చూడాలి.. ఎంతో ఊరట చెంది పాపను  హత్తుకుంటాడు హృద్యంగా.

ఇంకో వీడియోలో ఒక మహిళ బేబీని ఎత్తుకుని,  వాకర్‌ని ఊపుతూ ఉంటుంది బేబీని నిద్రపుచ్చాలని. కానీ కొన్ని క్షణాల్లో వాకర్‌లో ఏమీ లేకపోవడంతో  బేబీని  హడావిడిగా వెదుకుతూ ఉంటుంది. కాసేపటిరి బేబీ తన దగ్గరే.నన తన చంకలోనే ఉందన్న సంగతి తెలుసుకుని హమ్యయ్యా అనుకోవడమే కాదు  తెగ నవ్వుకుంటుంది. మనమందరం కొన్నిసార్లు గందరగోళానికి గురవుతాము అంటూ నెటిజన్లు కమెంట్స్‌ చేశారు 

>
మరిన్ని వార్తలు