Megha Akash: తారలా తళుకులీనుతున్న మేఘా ఆకాశ్‌.. ఈ ట్రెండీ లుక్‌కు కారణం?

18 Jan, 2023 12:53 IST|Sakshi
మేఘా ఆకాశ్‌ (PC: Instagram)

మేఘా ఆకాశ్‌... ‘లై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటికి సోషల్‌ మీడియాలోనూ తెగ క్రేజ్‌ ఉంది. సందర్భానికి తగ్గట్టు  ట్రెండీ, ట్రెడిషనల్‌ దుస్తుల్లో మెరుస్తూ ఫ్యాషన్‌ వరల్డ్‌లో తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్‌ చేసుకుంది. ఆ స్టయిల్‌కి సిగ్నేచర్‌ అయిన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. 

మ్యాడర్‌ మచ్‌
మ్యాడర్‌ మచ్‌ స్థాపకురాలు.. అనితా చంద్రమోహన్‌. ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లోని చేనేత కలెక్షన్స్‌లో ‘మ్యాడర్‌ మచ్‌’ డిజైన్స్‌ ఉండాలన్నది ఆమె లక్ష్యం. సహజ రంగులను ఉపయోగించి, స్థానిక అద్దకం, చేనేత కళాకారులతోనే ఇక్కడి ప్రతి డిజైన్‌ రూపుదిద్దుకుంటుంది.

గులాబీ, ఎరుపు రంగు అద్దకం కోసం ఎక్కువగా ఉపయోగించే మంజిష్ఠ (చెక్క) ఈ బ్రాండ్‌ ప్రధాన వస్తువు. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఇండియన్‌ మ్యాడర్‌ అని పిలుస్తారు. అందుకే, ఈ బ్రాండ్‌కు  ‘మ్యాడర్‌ మచ్‌’ అని పేరు పెట్టారు. ఇక వీటి డిజైన్, నాణ్యత ఫస్ట్‌క్లాస్‌. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. 


PC: Instagram

వి
విబితా ఎడ్వర్డ్, విజేతా ఎడ్వర్డ్‌.. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.  బటన్‌ మేకర్స్‌ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే వారికి బటన్‌ మేకింగ్‌లోని సూక్ష్మ విషయాలు సహా అన్నీ తెలుసు. చెల్లెలు విబితా.. తయారీ లోపంతో తిరస్కరించిన బటన్స్‌తో ఫ్యాషన్‌ ఉపకరణాలను చేసేది.

ఆమె ఆలోచనకు అక్క విజేతా తోడైంది. వెంటనే, 2018లో ‘వి’ పేరుతో ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించారు. 85 శాతం రీసైక్లింగ్‌కు వచ్చిన బటన్స్‌నే వాడతారు. పర్యావరణానికి హాని కలిగించే సింథటిక్, పాలియస్టర్‌ బటన్స్‌ను ఉపయోగించరు. ఇక వీటి ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌ అన్నింటిలోనూ ఈ జ్యూయెలరినీ కొనుగోలు చేయొచ్చు. 

బ్రాండ్‌ వాల్యూ
డ్రెస్‌ బ్రాండ్‌:  మ్యాడర్‌ మచ్‌ 
ధర: రూ. 35,580

జ్యూయెలరీ
బ్రాండ్‌: వి
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

ప్రయాణాలు చేయటం చాలా ఇష్టం. అందుకే, నా దుస్తుల్లో ఎక్కువగా క్యాజువల్‌ వేర్స్‌ ఉంటాయి. నా స్టయిల్‌ ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటుంది.
 – మేఘా ఆకాశ్‌. 
దీపిక కొండి 

మరిన్ని వార్తలు