ముఖంపై ముడతలు, మచ్చలను మాయం చేసే డివైజ్‌..!

7 Nov, 2021 12:42 IST|Sakshi

మేకప్, టచప్‌ అంటూ ఎన్ని కాస్మొటిక్‌ ప్రోడక్ట్స్‌ మార్చినా.. యవ్వనానికి మించిన అందమే ఉండదు. అందుకే ఆ యవ్వనం కోసం తాపత్రయపడుతుంటారు సౌందర్యప్రియులు. వయసు పెరిగేకొలదీ వచ్చిన.. ముడతల చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ మైక్రోడెర్మాబ్రేషన్‌ సిస్టమ్‌. చూడటానికి సిస్టమ్‌లానే, మినీ ల్యాప్‌టాప్‌లా కనిపించే... ఈ డివైజ్‌ వయసుతో వచ్చే ముడతలను, గీతలను ఇట్టే పోగొడుతుంది. చర్మానికి తగిన స్పాను అందిస్తుంది.

Microdermabrasion: ఆటో మోడ్, సెన్సిటివ్‌ మోడ్, మాన్యువల్‌ మోడ్‌.. అనే మూడు వేరువేరు మోడ్స్‌తో చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్‌ స్క్రబ్‌ను అందిస్తుంది. సిస్టమ్‌కి కుడివైపున అటాచ్‌ అయిన పొడవాటి ట్యూబ్‌ (ప్లాస్టిక్‌ వాండ్‌) లాంటిది ఉంటుంది. దానికే మరో చివర, డివైజ్‌తో పాటు లభించే.. 3 విడి భాగాలను అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ట్రీట్మెంట్‌ తీసుకోవాలి.

అవే.. పోర్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ టిప్‌ (రంధ్రాలను రూపుమాపేందుకు సహకరించే పార్ట్‌), మాగ్నెటిక్‌ ఇన్ఫ్యూజర్‌ టిప్‌ (మృతకణాలను, వ్యర్థాలను తొలగించే పార్ట్‌), డైమండ్‌ టిప్‌ (ముడతలు, గీతలు తొలగించే పార్ట్‌). వాటిని అమర్చిన తర్వాత.. ప్లాస్టిక్‌ వాండ్‌ను పెన్‌ మాదిరి పట్టుకుని, చర్మానికి ఆనిస్తే సరిపోతుంది. పునర్‌యవ్వనంతో కూడిన ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం.

ల్యాప్‌టాప్‌లా ఉన్న ఈ సిస్టమ్‌లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్‌ బటన్, మోడ్‌ సెలెక్షన్‌ బటన్, స్టార్ట్‌/స్టాప్‌ బటన్, లెవల్స్‌/ఏరియా బటన్, ఎల్‌సిడి స్క్రీన్‌ ఉంటాయి. వాటిని ఆపరేట్‌ చేసుకుని అద్దంలో చూసుకుంటూ ట్రీట్మెంట్‌ తీసుకోవచ్చు. పవర్‌ అడాప్టర్, క్లీనింగ్‌ బ్రష్, రీప్లేస్‌మెంట్‌ ఫిల్టర్స్‌ (డైమండ్‌ టిప్‌లో మార్చాల్సిన ఫిల్టర్స్‌) మెషిన్‌తో పాటు లభిస్తాయి. దీని ధర సుమారు 179 డాలర్లు. అంటే 13,405 రూపాయలు. 

చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!

మరిన్ని వార్తలు