హ్యండ్ల్యూమ్స్‌తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్‌ స్టైల్స్‌!

22 Sep, 2023 09:17 IST|Sakshi

యువ ఆలోచనల్లో పర్యావరణం కళగా రూపుదిద్దుకుంటోంది. ఫ్యాషన్‌ వేర్‌లో ప్రత్యేకతతో పాటు నేచర్‌ పట్ల బాధ్యతనూ తెలుసుకుంటుంది. మనవైన చేనేతలు పెద్దవాళ్లకే సూట్‌ అవుతాయన్న ఆలోచన నుంచి మోడర్న్‌ టర్న్‌ తీసుకుంటోంది. హ్యాండ్లూమ్స్‌తో ఇండోవెస్ట్రన్‌ స్టైల్స్‌ ఆకట్టుకునేలా డిజైన్‌ చేయిస్తోంది హైదరాబాద్‌ వాసి, నటి, మోడల్‌ నిత్యాశెట్టి. హ్యాండ్లూమ్స్‌తో తన జర్నీఎప్పుడూ ప్రత్యేకమే అని చెబుతోంది నిత్య.

ప్రొఫెషనల్స్‌ కాదు...ఈ డ్రెస్సులు ధరించడానికి మోడల్స్‌ ఎవరూ ప్రొఫెషనల్స్‌ కాదు. సాఫ్ట్‌వేర్, వెయిట్రెస్, ఇంటీరియర్‌ డిజైనర్, డెంటిస్ట్‌.. ఇలా ఇతర రంగాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు నేను చేసే డ్రెస్సులకు మోడల్స్‌గా చేస్తున్నారు. ఏ రంగంలో ఉన్నవారైనా వీటి ద్వారా దుస్తులు మన క్యారెక్టర్‌ని చూపాలన్నదే మెయిన్‌. మేకప్‌ వంటి హంగులేవీ లేకుండా నేచరల్‌గా మా డిజైన్స్‌ని ప్రెజెంట్‌ చేయాలయనుకున్నాను. దీనివల్ల అందరికీ రీచ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డే రోజున నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో మా డిజైన్స్‌ని కూడా ప్రదర్శించి, మాదైన ప్రత్యేకతను చూపాం.

హ్యాండ్లూమ్‌ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్‌ పెట్టి, మా వర్క్‌ని మరింత మందికి చేరువయ్యేలా చూస్తున్నాను. బ్రెజిల్‌లో జరగబోయే కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పది యూనిట్స్‌ వెళుతున్నాయి. అందులో మా ఇతిహాస కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్నారు నిత్య. ‘‘హ్యాండ్లూమ్స్‌ అంటే నేటితరం చీరలు, కుర్తా పైజామా వరకే అనుకుంటారు. కానీ, యువత ధరించేందుకు వీలుగా రెగ్యులర్‌ వేర్‌గా, ఫ్యాషన్‌ వేర్‌గా హ్యాండ్లూమ్స్‌ను తీసుకు రావాలనుకున్నాను. ఇందుకు.. పోచంపల్లి, పుట్టపాక, పెడన, ఒరిస్సా, భువనేశ్వర్‌ హ్యాండ్లూమ్స్‌ వారిని కలిశాను. వీటిలో నుంచి చందేరీ, ఇక్కత్, చికంకారి, శిబోరి, బాందినీ, టై అండ్‌ డై .. వంటివి డ్రెస్‌ డిజైన్స్‌లో ప్రధానంగా తీసుకున్నాను. హ్యాండ్లూమ్స్‌తో బ్లేజర్లు, ఖఫ్తాన్స్, ప్లాజో, లాంగ్‌ అండ్‌ షార్ట్‌ ఫ్రాక్స్,  షర్ట్స్‌.. నేటి యువతకు మెచ్చేలా మెన్‌ అండ్‌ ఉమెన్‌కి క్యాజువల్‌ అండ్‌ ఆఫీస్‌వేర్‌ ‘ఇతిహాస’ పేరుతో రూపొందిస్తున్నాం. ఈ ఇండో–వెస్ట్రన్‌ స్టైల్స్‌తో నేటితరానికి మన హ్యాండ్లూమ్స్‌ని దగ్గర చేయాలని, చేనేతకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నదే నా ఆలోచన.   

(చదవండి: విలేజ్‌  అండ్‌  వింటేజ్‌ స్టైల్‌!)

మరిన్ని వార్తలు