యాక్‌..ఛీ.. వాటి విసర్జలనతో టీ చేసి తాగుతారట..!

31 Oct, 2021 08:55 IST|Sakshi

బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, లెమన్‌ టీ ఎట్‌సెట్రా చాలా రకాల టీలు విన్నాం.. తాగుతున్నాం కూడా. చైనాలో పాండా విసర్జనలతో కూడా టీ కాస్తారట తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన టీ ఇది. సాధారణంగా పాండాలు వెదురు మొక్కలను తింటాయి.

దాంతో అవి విసర్జించే పేడలో అత్యధిక పోషకాలు, విటమిన్స్, క్యాన్సర్‌ నిరోధకాలు ఉంటాయట. అందుకే ఒక పాండా టీ ప్యాకెట్‌ విలువ రూ.2.4 లక్షలు. ఒట్టి పాండాలే కాదు సేంద్రియ తేయాకులను తినే పురుగుల విసర్జనతో కూడా చైనీయులు చాయ్‌ తయారుచేస్తారు.

ఈ చాయ్‌ ఒక కప్పెడు కావాలంటే రూ.200 పైనే చెల్లించాలి. రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఈ టీ తాగితే చాలా మంచిదట. అందుకే అక్కడ చాలామంది వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిల్లో కూడా రకరకాల ఫ్లేవర్స్‌ ఉంటాయి. 

మరిన్ని వార్తలు