తల్లిపాలు... రకాలు!

18 Jul, 2021 10:07 IST|Sakshi

రొమ్ము పాలు పట్టే తల్లి... తన బిడ్డకు పాలు తాగేటప్పుడు ఆమె నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదటిది తొలిసారి వచ్చే పాలు. వీటిని ఫోర్‌ మిల్క్‌ అంటారు. రెండోది మలిసారి పాలు... వీటిని హైండ్‌ మిల్క్‌ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ హైండ్‌ మిల్క్‌ అన్నవి.. చిన్నారి కాసిన్ని పాలు తాగాక స్రవించడం మొదలవుతాయి. వాస్తవానికి ఫోర్‌ మిల్క్‌ కంటే... హైండ్‌ మిల్క్‌ చాలా బలవర్ధకమైనవి, పుష్టికరమైనవి, మంచి పోషకాలను ఇచ్చేవి. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. అందుకే పిల్లలు పది పదిహేను గుటకలు వేశాక స్రవించే పాలు చాలా మంచివన్న విషయం తల్లి గ్రహించడం మేలు. 

ఫోర్‌ మిల్క్‌ను ముర్రుపాలతో పొరబడవద్దు... 
పిల్లలకు బ్రెస్ట్‌ ఫీడింగ్‌ మొదలు కాగానే... స్రవించే ఫోర్‌ మిల్క్‌ను... ప్రసవం కాగానే తొలి రెండు మూడు రోజుల్లో స్రవించే ముర్రుపాలతో పొరబాటు పడవద్దు. నిజానికి ముర్రుపాలు వేరు, ఫోర్‌ మిల్క్‌ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. మంచి రోగనిరోధకతను ఇస్తాయి. అద్భుతమైన ఇమ్యూనిటీ వ్యవస్థను నిర్మించడానికి దోహదపడతాయి. ఫోర్‌ మిల్క్‌ అంటే... ప్రతిసారీ పాలు తాగడం మొదలు పెట్టగానే తొలిసారి స్రవించేవి అనీ... ఓ పది–పదిహేను గుటకల తర్వాత స్రవించేవి హైండ్‌ మిల్క్‌ అనీ గుర్తుపెట్టుకుంటే చాలు.

మరిన్ని వార్తలు