థ్రిల్‌ అయిన సేతుపతి

27 Feb, 2021 00:17 IST|Sakshi

‘‘డిఫరెంట్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఎ’ చిత్రం టీజర్, ట్రైలర్, సినిమా బాగున్నాయి. ఒక మంచి సినిమా తీసిన యూనిట్‌కి అభినందనలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. నితిన్‌  ప్రసన్న, ప్రీతీ  అస్రాని జంటగా యుగంధర్‌ ముని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎ’. అవంతిక ప్రొడక్షన్స్‌పై పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ సినిమా మార్చి 5న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్‌ సేతుపతి ఇటీవల విడుదల చేశారు.

ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో చిత్రబృందం విజయ్‌ సేతుపతిని కలిసి, తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమాలోని కొంత పార్ట్‌ని చూసిన విజయ్‌ సేతుపతిగారు ఎంతో థ్రిల్‌కి గురయ్యారు. ఆయన సపోర్ట్‌ మాకు ఉండడంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంది. పీవీఆర్‌ పిక్చర్స్‌ వారు మా సినిమాను విడుదల చేస్తున్నారు. విజయ్‌ కురాకుల సంగీతం అందించగా, అనంత్‌ శ్రీరామ్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు