మల్టీ ఫంక్షనల్‌ పాట్‌.. వెరైటీ వంటలన్నీ వండేయొచ్చు

2 Oct, 2023 11:04 IST|Sakshi

క్వాలిటీ ప్లస్‌ కంఫర్టబుల్‌ ఫీచర్స్‌తో రూపొందిన ఈ మల్టీఫంక్షనల్‌ పాట్‌.. చాలా వంటకాలను రెడీ చేస్తుంది. ఇందులో అన్ని రకాల రైస్‌ ఐటమ్స్, కర్రీస్, నూడుల్స్, సూప్స్‌ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. సుమారుగా రెండు లీటర్ల సామర్థ్యం గల ఒక ప్రత్యేకమైన పాట్‌తో పాటు.. నాన్‌ స్టిక్‌ ప్లేట్, పాన్‌ కేక్‌ ప్లేట్, గ్రిల్‌ పాన్‌  వంటివి అదనంగా లభిస్తాయి.

అవసరాన్ని బట్టి వాటిని మార్చుకోవచ్చు. వాటితో ఆహారాన్ని గ్రిల్, ఫ్రైలతో పాటు స్టీమ్‌ కూడా చేసుకోవచ్చు. స్లో కుకర్‌లా మార్చి చాలా వెరైటీలను వండుకోవచ్చు. ఆన్‌ లేదా ఆఫ్‌ బటన్‌ తో పాటు టెంపరేచర్‌ కంట్రోలర్‌ కూడా డివైస్‌ ముందువైపు ఉంటుంది. 

మరిన్ని వార్తలు