ఈ ‘ఐటమ్‌ సాంగ్’ను స్కూల్లో పాఠంగా చేర్చారు!

3 Apr, 2021 06:46 IST|Sakshi

‘సినిమా బాగుందా?’ అనే ప్రశ్నతో పాటు ‘ఐటమ్‌ సాంగ్‌ ఉందా?’ అనే ఉపప్రశ్న కూడా ఎదురవుతుంటుంది. ‘ఈ సందర్భంలో ఇలాంటి పాట ఉండాలి’ అనేది సినిమా రూల్‌. అయితే ఐటమ్‌సాంగ్‌ మాత్రం కచ్చితంగా పక్కాగా మాస్‌ పాటై ఉండాలి. అలాంటి ఒక మాస్‌ పాటకు ఇప్పుడు మహర్దశ పట్టింది. సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌’ సినిమాలో ‘మున్నీ బద్నామ్‌ హుయి’ ఐటమ్‌ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో తెలియంది కాదు. ఈ పాటను ‘ఇంగ్లాండ్‌ న్యూ మ్యూజిక్‌ కరికులమ్‌’లో చేరుస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (డిఎఫ్‌యి) న్యూ కరికులమ్‌ గైడ్‌ను ఇటీవలే లాంచ్‌ చేసింది.

బ్రిటన్‌లోని టీచర్స్, ఎడ్యుకేషన్‌ లీడర్స్, సంగీతకారులలో నుంచి ఎంపిక చేసిన 15 మంది అత్యున్నత బృందం ‘మోడల్‌ మ్యూజిక్‌ కరికులమ్‌’ను అభివృద్ధి చేసింది. మన శాస్త్రీయ సంగీత పాఠాలతో పాటు భాంగ్రా బీట్, ఐటమ్‌సాంగ్స్‌ను చేరుస్తున్నారు.  ‘జయహో’, సహేలిరే, ఇండియన్‌ సమ్మర్‌... మొదలైన పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అన్ని జానర్స్‌లోని ఈ పాటలు సంగీతం నేర్చుకునే విద్యార్థులకు పాఠాలు, కేస్‌స్టడీలుగా ఉపయోగపడతాయి. ‘హుషారెత్తించి సంగీతంతో పాటు కలర్‌ఫుల్‌ విజువల్స్‌ ఈ పాట ప్రత్యేకం’ అని ‘మున్నీ బద్నామ్‌ హుయి’ పాటకు కితాబు ఇచ్చింది బృందం. 

మరిన్ని వార్తలు