Fashion: చేనేతలతో సీజన్‌ వేర్

23 Apr, 2021 13:37 IST|Sakshi

విధుల్లో వినూత్నం
సౌకర్యంలో సమున్నతం
సింప్లీ సూపర్బ్‌ అనిపించే 
చేనేతలదే ఈ సీజన్‌ అంతా!

కరోనా సెకండ్‌ వేవ్‌ స్టార్ట్‌ అయ్యింది. తప్పనిసరి అనుకున్న సంస్థల్లో ఉద్యోగులు తమ విధులను నిర్వరిస్తున్నారు. ఇది వేసవి కాలం కూడా. సీజన్‌కి తగ్గట్టు చికాకు కలిగించని క్లాత్‌తో డిజైన్‌ చేసిన డ్రెస్‌ ధరిస్తే మేనికి హాయిగా ఉంటుంది. అలాగే, మాస్క్, శానిటైజర్‌ వంటివి వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు డ్రెస్సుల మీదకు దుపట్టా లాంటివి ధరించాలన్నా కొంత ఇబ్బందే. వీటన్నింటికి పరిష్కారంగానే ఫ్యాషన్‌ డిజైనర్‌ హేమంత్‌ సిరీ ఆంధ్ర చేనేత బొబ్బిలి, తెలంగాణ చేనేత నారాయణ్‌పేట్‌ చీరలతో చేసిన డ్రెస్‌ డిజైన్స్‌ ఇవి. సింపుల్‌గా, ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు ఇలా బ్లేజర్‌ స్టైల్‌ లాంగ్‌ కుర్తా డిజైన్‌ని రెడీ చేసుకోవచ్చు. 


నారాయణ్‌పేట్‌ శారీస్‌కి బార్డర్‌ ఉంటుంది. దీనిని కూడా డిజైన్‌లో భాగం చేసుకోవచ్చు. చేతుల చుట్టూ అలాగే ఒక వైపు కుర్తా లెంగ్త్‌ బార్డర్‌ను జత చేసుకుంటే డ్రెస్‌ ప్రత్యేకంగా  కనిపిస్తుంది.

డ్రెస్‌ ప్రత్యేకతలు 
►బ్లేజర్‌ స్టైల్‌ లాంగ్‌ కుర్తా. 
►మాస్క్, చిన్న శానిటైజర్‌ బాటిల్, ఫోన్‌ వంటివి క్యారీ చేయడానికి పాకెట్స్‌.
►మోచేతుల భాగంలో హ్యాండ్‌ స్లిట్స్‌
►స్ట్రెయిట్‌ కట్‌ పాయింట్‌
 ఉద్యోగినులకు, టీనేజర్స్‌కి ఈ స్టైల్‌ సూట్స్‌ ప్రత్యేకమైన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.   

-హేమంత్‌ సిరీ, ఫ్యాషన్‌ డిజైనర్, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు