Sweet Potato Day- Health Benefits: చిలగడ దుంప తినడం ఇష్టమా.. ఈ విషయాలు తెలిస్తే!

22 Feb, 2022 13:14 IST|Sakshi

ఫిబ్రవరి 22న  కుక్ ఎ స్వీట్ పొటాటో డేగా జరుపుకుంటారు. ఓహో.. ఇదో రోజు కూడా ఉందా అని అనుకుంటున్నారా? ఎస్‌  ఉంది. మరి వెల్‌.. రూట్ వెజిటబుల్‌ గా చెప్పుకునే ఈ చిలగడ దుంపకు పెద్ద చరిత్రే ఉంది. వేల ఏళ్ల క్రితమే ఉనికిలో ఉన్న స్వీట్‌ పొటాటో మధుమేహంతో బాధపడేవారికి ఒక వరం లాంటిదట. చిలగడదుంప వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 


మధ్య అమెరికా లేదా దక్షిణ అమెరికాలో చిలగడ దుంప లేదా స్వీట్‌ పొటాటో పుట్టిందని భావిస్తున్నారు. ఇవ ఇతర దుంపల కంటే చాలా ఆరోగ్యకరమైనవట. విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ చిలగడదుంపల్లో విటమిన్ B-6, మెగ్నీషియం,  విటమిన్ సీతోపాటు, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు , కేలరీలతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది. అలాగే ఈ దుంపలలోని అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది.

చిలగడ దుంపలు మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్ని ఉత్పత్తిచేసే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరరీ, యాన్తోసయానిన్‌ కూడా లభ్యం. ఇది  ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో అధికంగా ఉండే కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్, శరీరంలో విటమిన్ Aని తయారుచేయడానికి సహాయపడతాయి. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ని తగ్గించి, తద్వారా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది కూడా. విటమిన్ D అధికంగా అతికొద్ది ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి. సన్ షైన్ విటమిన్‌గా చెప్పుకునే  విటమిన్‌ డీ  చిలగడ దుంపలలో తక్షణమే అందుబాటులో ఉంటుంది.

చిలగడ దుంపలను ఆహారంలో చేర్చుకోవడం వల్లన చర్మం మెరుస్తుంది. నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మధుమేహం కలవారు మామూలు దుంపలు తీసుకోవడానికి బదులుగా ఈ చిలగడ దుంపలను తీసుకోవడం మంచిది.  గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహా నియంత్రణకు తోడ్పడుతుందని డైటీషియన్స్‌ చెబుతున్నారు.

చిలగడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్‌లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రక్రియను నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్న మాట. ఆంథోసైనిన్స్ అనే పాలీఫెనోలిక్ సమ్మేళనం ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మితంగా తింటే, అన్ని రకాల చిలగడదుంపలు ఆరోగ్యకరమేననీ, వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ చాలా ఎక్కువ గనుక డయాబెటిస్-ఫ్రెండ్లీ డైట్‌లో చేర్చు కోవచ్చని చెబుతున్నారు. 

చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్‌ అనే ఎంజైమ్‌ వల్ల...
Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే..

మరిన్ని వార్తలు