ఇవాళే జాతీయా బాలికా దినోత్సవం! దేశంలో లింగ నిష్పత్తి, బాలికల స్థితి ఎలా ఉందంటే..

24 Jan, 2024 13:58 IST|Sakshi

భారత్‌లో ప్రతి ఏడాది జనవరి24నజాతీయ బాలికా దినోత్సవాన్ని(National Girl Child Day) జరుపుకుంటారు. ఈ ఏడాది 16వ బాలికా దినోత్సవాన్ని దేశంలో జరుపుకుంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం దేశంలోని బాలికలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించి, వారికున్న హక్కులు, సమస్యలతో ఎలా పోరాడాలి తదితరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అలాగే   మహిళ సాధికారతకు పెద్దపీట వేసేలా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే  ధ్యేయంగా ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఇక ఈ రోజునే భారత తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాందీ ఈ రోజునే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల మహిళ సాధికారతకు ఇదే అతిపెద్ద నిదర్శనం అని చాటి చెప్పేలా ఈ రోజునే జాతీయా బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు. తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జనవరి 24, 2008న జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేషన్‌ ఫ్యామిలీ హల్త్‌ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5)ఏం చెబుతోంది? ప్రస్తుతం బాలికల స్థితి ఎలా ఉంది తదితరాల గురించి తెలుసుకుందాం!

ఎన్‌హెచ్‌ఎస్‌ గత నాలుగేళ్ల సర్వేలో..2015-16లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 991 మంది మహిళలు ఉండగా, 2019-21లో 1,020 మంది మహిళు మెరుగుదల కనిపించింది. ఈ కాలంలో స్త్రీల ఆయుర్దాయం కూడా గణనీయంగా మెరుగుపడింది కూడా. చెప్పాలంటే ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్న ఇన్నే ఏళ్లలో నెమ్మది నెమ్మదిగా చాలా మార్పులు సంతరించుకున్నాయి కూడా. కానీ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు మాత్రం తగ్గలేదు. చాలా చోట్ల కొంతమంది బాలికలకు విద్యా అవకాశాలు అందని ద్రాక్షలానే ఉండటం బాధకరం.

నిజానికి భారతదేశంలో ఇందుకు సంబంధించిన కట్టుదిట్టమైన మంచి చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమల ఒక సవాలుగా ఉంది. ఆయా తాలుకా కేసుల్లో బాధిత బాలికలకు సత్వర న్యాయం కూడా అందడం లేదు. ఇక్కడ గర్ల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ న్యాయవ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించి ఆ దిశగా వారికి న్యాయం సత్వరం అందే యత్నం చేయాల్సి ఉంది. అలాగే క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తిని (సీఎస్‌ఆర్‌) సమస్యను పరిష్కరించే దిశగా 2015న హర్యానాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి బేటి బచావో బేటీ పఢావో(బీబీబీపీ)ని ప్రారంభించారు.

ఇది ఇది మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య -కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే జాతీయ కార్యక్రమం. దీనితో భ్రూణ హత్యలకు అడ్డుకట్టవేసి, వారికి విద్యా అవకాశాలు అందేలా చేయమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఒక రకంగా బాలికల మనుగడకు, అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అద్భుతమైన కేంద్ర పథకం ఇది.

అలానే ఇలాంటి ఎన్నో బాలికల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో.. మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌ల అభివృద్ధికి సంబంధించిన ప‌థ‌కాలు, స్త్రీ సంక్షేమ పథకాలు, కౌమర బాలికలు పథకం వంటివి తీసుకొచ్చింది. మహిళ సాధికారతకు, లింగ సమానత్వానికి పెద్ద పీట వేసింది. అంతేగాదు ఈ దినోత్సవం పేరుతో ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకోస్తున్నారు కూడా. అయితే లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. మహిళలు, బాలికలు జీవితాంత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. అది సమూలంగా తొలిగి దేశంలో ఆడపిల్లలు వారి హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయగలిగేతే దేశం మరింత అభివృద్ధిని సాధించనట్లే. 

(చదవండి: జాతీయ బాలికా దినోత్సవం 2024: ఎదగాలి.. చదవాలి!)

whatsapp channel

మరిన్ని వార్తలు