ఆటల మాటల పాటల పుత్తడి బొమ్మరా... ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా!

23 Jan, 2022 00:51 IST|Sakshi

జాతీయ బాలికా దినోత్సవం: జనవరి 24

ఒక మంచి మాట చల్లగా దీవిస్తూ  అంటుంది ఇలా...
‘నీకు ఆడబిడ్డ పుట్టింది. ఇక అంతా అదృష్టమే’
ఇక పాట విషయానికి వస్తే తెలుగు పాట రకరకాల భావాలతో చిట్టితల్లికి పాదాభివందనం చేసింది. వాటిలో కొన్ని పాటల గురించి...

 గద్దర్‌ గొంతులో వినిపించే ‘నిండూ అమాసనాడు’ పాట ప్రతి పల్లెను, ప్రతి హృదయాన్ని తాకింది. ‘ఆడపిల్ల నాకొద్దు’ అనే మూర్ఖత్వాన్ని కన్నీటీతో కడిగిపారేసింది. ఎంతోమంది తండ్రుల్లో గొప్ప మార్పును తెచ్చిన పాటగా ‘నిండూ ఆమాసనాడు’ పాటను చెబుతారు. ఆ పాటను మరోసారి పాడుకుందాం...

‘నిండూ అమాసనాడు    ఓ లచ్చగుమ్మడి /ఆడబిడ్డ పుట్టినాదో  ఓ లచ్చగుమ్మడి
అత్తా తొంగిచూడలేదో    ఓ లచ్చగుమ్మడి/ మొగడు ముద్దాడరాలే    ఓ లచ్చగుమ్మడి
సెత్త గంపలేసుకొని       ఓ లచ్చగుమ్మడి/ సెత్త కుండిలెయ్యబోతే    ఓ లచ్చగుమ్మడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి      ఓ లచ్చగుమ్మడి/ అక్కా అట్లా సెయ్యొద్దనే    ఓ లచ్చగుమ్మడి
బట్లలల్ల సుట్టుకోని        ఓ లచ్చగుమ్మడి/ బాయిలో పడెయ్యబోతే   ఓ లచ్చగుమ్మడి
గంగమ్మ కొంగు జాపి        ఓ లచ్చగుమ్మడి/ సెల్లె దానమియమందో    ఓ లచ్చగుమ్మడి
పున్నామిదినము వోలే      ఓ లచ్చగుమ్మడి/పుట్ట కాడ పడవేస్తే            ఓ లచ్చగుమ్మడి
నాగన్న గొడుగు పట్టిండమ్మో   ఓ లచ్చగుమ్మడి....’

ఇక సినిమాల విషయానికి వస్తే...‘ఆకాశమంత’ సినిమాలో ఒక తండ్రి తన చిట్టిపాప గురించి ఇలా మురిపెంగా పాడుకుంటాడు... (రచన: అనంత్‌ శ్రీరామ్‌)
ఆటల మాటల పాటల పుత్తడి బొమ్మరా /ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా
మేఘాల పల్లకి తెచ్చిస్తా/ లోకాన్ని కొత్తగా చూపిస్తా
వెన్నెలే కురిపిస్తా   చల్లని హాయి అందిస్తా /పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తా
లాలి పాటే నేనై లాలి పోసేవాడిని నేనవుతా

‘విశ్వాసం’ సినిమాలో అజిత్‌కుమార్‌ ఒక తండ్రిగా తన బంగారుతల్లి గురించి ఇలా పాడుకుంటాడు... (రచన: రామజోగయ్య శాస్త్రి)
‘చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా చిట్టి జాబిల్లి/నీ ఊసులోనే ముసురాడుతుంది ఈ నాన్న ఊపిరి’
‘నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి
జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాలవాకిలి
ఏ బూచి నీడ నీపై రాకుండా నేనేగా కావలి’    
‘కనుచివరన జారే తడి చినుకును సైతం/ సిరి తళుకుగా మార్చే చిత్రం నీదే’

చిరంజీవి ‘డాడీ’ సినిమాలో తండ్రి  తన కను‘పాప’ గురించి ఇలా పాడుకుంటాడు...(రచన: సిరివెన్నెల)
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడీ/ డాడీ ఊపిరిలో మెరిసే కూచిపూడి
చిందాడీ చిందాడీ తుళ్లిందంటే చిన్నారీ /మమ్మీ చూపుల్లో ఎంతో వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి/ ముదై్దన తినదే పరుగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవులో ఎన్నో ఊసులాడి/ పడుకోదే పన్నెండైన ఏంచేయాలి
నీ నవ్వే చూసి నిలువెల్లా పొంగి పోని/కాసేపు ఉంటే చాలే ఈ నాన్న తోటి
వెయ్యేళ్లు జీవిస్తానే ఆశతోటి.
       

మరిన్ని వార్తలు