National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్‌ తాగారంటే..

6 Sep, 2021 13:48 IST|Sakshi

ఎన్నడూలేనిది గత రెండేళ్లుగా మాత్రం అందరికి ఆరోగ్యంపై తెగ శ్రద్ధ పెరిగింది. అందుకు కరోనా కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలను హరించేస్తుంది. దీంతో అందరి దృష్టి ఇమ్యునిటీ ఏవిధంగా పుంజుకుంటుందనే విషయంపై పడింది. ఒకప్పుడు (రెండేళ్ల క్రితం) రుచిగా ఉండే వంటకాలు, స్పైసీ వంటకాలు, స్వీట్స్‌.. వీటినే ఎడాపెడా తినేశాం​. కానీ రోజులు మారాయి. ఆహారపు అలవాట్లు కూడా మారాలనే వాస్తవం సర్వమానవలోకానికి త్వరగానే బోధపడింది.

దీంతో ఆచితూచి ఏది తినాలో, ఏది తాగాలో ఆలోచించడం ప్రారంబించాం. ఉదయం ఆహ్లాదంగా ప్రారంభమైతే రోజంతా దాని ప్రభావం మనపై ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా సెప్టెంబర్‌ 1 నుంచి జాతీయ పోషకాహార వారం (నేషనల్‌ న్యూట్రిషన్‌ వీక్‌)ప్రారంభమైన నేపథ్యంలో అటు రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రతి ఉదయం తీసుకోల్సిన పానియాలు, వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చదవండి: క్యాన్సర్‌.. ఫాలో అప్‌ల ప్రాధాన్యమెంత? ఇదిగో ఇంత!

గ్రీన్‌ జ్యూస్‌
ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి. వీటిని జ్యూస్‌ రూపంలో ప్రతిరోజూ తాగవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే.. పాల కూర, లెట్యూస్‌ ఆకులు లేద కాలే తో జ్యూస్‌ చేసుకుని, మీ రుచికి తగినవిధంగా కొంచెం షుగర్‌ను జోడించండి. ఈ విధంగా తయారుచేసుకున్న జ్యూస్‌ ప్రతి ఉదయం తాగడం ద్వారా అనేకరకాల పోషకాలను అందించడంతోపాటు మీ ఇమ్యునిటీని కూడా పెంపొందిస్తుంది.

బొప్పాయి జ్యూస్‌
ఈ జ్యూస్‌ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఎంతో ఉపకరిస్తుంది. 5 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ జ్యూస్‌లో విటమిన్‌ ‘సి’ అధిక మోతాదులో ఉంటుంది. తొక్క తీసిన బొప్పాయి ముక్కలతో చేసిన జ్యూస్‌లో, నానబెట్టిన హలిమ్‌ విత్తనాలను కలుపుకుని తాగవచ్చు.

బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌
బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌లో ‘ఏ, సి, ఇ’ విటమిన్లతో పాటు ఐరన్‌, కాల్షియమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ మిశ్రమంలో కొంచెం అల్లం, పసుపు కలిపి తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధకత పుంజుకుంటుంది. ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడేవారికి ఈ జ్యూస్‌ ఉపశమనాన్నిస్తుంది.

వెలగపండు పానియం
మన దేశంలో ఎ‍క్కడైనా దొరికే ఔషధ ఫలం వెలగపండు . దీనిని మారేడు పండు అని కూడా అంటారు. ఈ పండులో ఫైబర్‌, విటమిన్‌ ‘సి’ లతోపాటు పోషకాలు నిండుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపకరించే ఈ వెలగపండు జ్యూస్‌ వడదెబ్బ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. 

కొకుమ్‌, అంజీర జ్యూస్‌
కొకుమ్‌ ఫలాలు, అంజీర పండ్ల రసంలో జీలకర్ర పొడి, బ్లాక్‌ సాల్ట్‌ను కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్‌లో ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంత చల్లటి నీటిని చేర్చి రోజు మొత్తంలో ఏ వైళలోనైనా సేవించవచ్చు. ప్రతి ఉదయం ఈ 5 రకాలైన పానీయాలు తీసుకోవడం ద్వారా మీ ఇమ్యునిటీని పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసి చూడండి

మరిన్ని వార్తలు