Beauty Tips: మోము మెరిసేందుకు.. తులసి ఆకుల గుజ్జు, కమలా జ్యూస్‌, శనగపిండి ఇంకా..

7 Apr, 2022 15:16 IST|Sakshi

సహజమైన చర్మకాంతి కోసం..

మోము మెరుపు కోసం మార్కెట్టులో దొరికే లోషన్లు, క్రీముల వంటివి ఎన్ని కొనుగోలు చేసి వాడినా... తాత్కాలిక మెరుపు తప్ప శాశ్వతమైన కాంతి సొంతం కాదంటున్నారు. అందుకే ముఖసౌందర్యానికి కాస్త సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది.

కావల్సినవి:  క్లీనప్‌ : రోజ్‌ వాటర్‌ – 2 టీ స్పూన్లు; స్క్రబ్‌ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు; మాస్క్‌:  తులసి ఆకుల గుజ్జు  – 1 టీ స్పూన్, కమలా జ్యూస్‌ – అర టీ స్పూన్, శనగపిండి – 1 టీ స్పూన్‌

తయారీ:  
ముందుగా మెత్తని క్లాత్‌ తీసుకుని.. రోజ్‌ వాటర్‌తో ముఖం, మెడ క్లీన్‌ చేసుకోవాలి.
ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి.
తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి.
ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు,  కమలా జ్యూస్, శనగపిండి కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి.
ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడంతో పాటు రోజుకు మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.  

చదవండి: Summer Tips: స్విమ్‌ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి!

మరిన్ని వార్తలు