Insecta-Flying Car: గాలి ద్వారా పుట్టిన విద్యుత్తునే ఉపయోగిస్తూ..

24 May, 2022 16:50 IST|Sakshi

గాలిలో ఎగిరే కార్లను ఇప్పటికే కొందరు తయారు చేశారు. ఇవి విస్తృతంగా ఇంకా వాడుకలోకి రాలేదు గాని, వీటి తయారీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తయారైన ఎగిరే కార్లు పెట్రోల్, డీజిల్‌ లేదా లిథియం అయాన్‌ బ్యాటరీల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును ఇంధనంగా ఉపయోగించుకునే రకాలకు చెందినవే.


ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న ఎగిరే కారు తీరు మాత్రం మిగిలిన వాటన్నింటికీ పూర్తిగా భిన్నం. గాలి ద్వారా పుట్టిన విద్యుత్తునే ఉపయోగించుకుని, గాలిలో షికారు కొట్టడం దీని ప్రత్యేకత. కీటకం ఆకారంలో రూపొందించిన ఈ కారుకు ‘ఇన్సెక్టా’ అని పేరు పెట్టారు. సెర్బియన్‌ ఆటోమొబైల్‌ డిజైనర్‌ మార్కో పెట్రోవిక్‌ దీనిని రూపొందించారు.  

మరిన్ని వార్తలు