మహిళా ఆర్థిక అక్షరాస్యులు

28 Sep, 2020 08:31 IST|Sakshi

దేశంలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడేలా, అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేలా మొట్టమొదటి స్టార్టప్‌ వచ్చింది. ఈ స్టార్టప్‌ను ప్రారంభించినది ఓ మహిళ. పేరు నిస్సారీ మహేష్‌. చెన్నైవాసి. బ్యాంకింగ్‌ రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉన్న నిస్సారీ పదినెలల్లో పాతికవేల మందిని ఒకేచోట చేర్చింది. ఆన్‌లైన్‌లో మహిళల కోసం నిసారీ ప్రస్తుతం ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ సిరీస్‌ను నిర్వహిస్తోంది.

ఎవ్రీ మనీ టాక్స్‌
నిస్సారీకి రెండు సంస్థలు ఉన్నాయి. ‘హబ్‌ వర్డస్‌ మీడియా కంటెంట్‌ సర్వీస్‌’ ఒకటి. ఇది ఆన్‌లైన్‌ బ్రాండింగ్‌ సంస్థ. రెండవది ‘ఎవ్రీ మనీ టాక్స్‌’. ఇది మహిళ ల కోసం భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఫైనాన్షియల్‌ ప్లాట్‌ఫామ్‌. ఇది వారి ఆర్థిక పరిస్థితులను సరిగ్గా ప్లాన్‌ చేయడానికి సహాయపడుతుంది. నిసారీ మాట్లాడుతూ ‘చిన్న పెట్టుబడులు, ఆరోగ్య బీమా, పొదుపు ఖాతాలు, మైక్రో క్రెడిట్‌ రుణాలు వంటి ప్రాథమిక ఆర్థిక ఉత్పత్తుల గురించి తెలియని చాలా మంది మహిళలు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి వాటి గురించి మహిళలకు తెలియజేయడం చాలా ముఖ్యం’ అంటారు నిస్సారీ. ఇది ఒక డిజిటల్‌ ఫైనాన్షియల్‌ ప్లాట్‌ఫామ్‌.

 ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ 
ఇది మహిళలకు ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికీ సహాయపడుతుంది. ఈ సంస్థ మొదటి 10 నెలల్లో 25 వేల మంది మహిళలను ఈ వేదిక మీదకు చేర్చింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా నిస్సారీ బృందం మహిళలకు ఆర్థిక ప్రణాళికలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మహిళల కోసం నిసారీ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ సిరీస్‌ను నిర్వహిస్తోంది. ‘మహిళలు తమ కెరీర్, వ్యాపారం, ఆర్థిక ప్రణాళికలతో సాధికారత సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంతోషంగా ఉంది. ఫైనాన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడం ద్వారా మహిళలల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది’ అని చెబుతుంది నిస్సారీ.

మరిన్ని వార్తలు