Oral Health Tips: నోటి దుర్వాసనకు చెక్‌! లవంగాలను తరచూ చప్పరిస్తున్నారా.. అయితే

7 May, 2022 12:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నోటి దుర్వాసనకు సులువైన నివారణ

Top 7 Remedies For Bad Breath: నేటి తరుణంలో నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నది. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయి.

అవేమి ఉన్నప్పటికీ నోటి దుర్వాసనను పోగొట్టుకోవడం సులభమే. అదెలాగంటే... భోజనం చేశాక ఈ కింది పదార్థాలు తీసుకుంటే సరి! దాంతో నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు.

నోటి దుర్వాసన నివారణకు సులువైన చిట్కాలు
1. పెరుగులో ప్రోబయోటిక్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు. 
2. భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్‌ టీ తాగండి. ఇందులో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. 


3. ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్‌ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. 

4. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి. 
5. భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. 

6. భోజనం చేసిన తరువాత టీస్పూన్‌ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్‌ అవుతుంది. 
7. భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. 
చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే!

మరిన్ని వార్తలు