"పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్" ఎలా చేస్తారో వింటే షాకవ్వుతారు!

13 Feb, 2024 10:54 IST|Sakshi

ఇటీవల అందరికీ వంటకాల మీద ఆసక్తి ఎక్కువయ్యిందనే చెప్పాలి. అందులోనూ ఈ సోషల్‌ మీడియా పుణ్యమా! అని వాటికి క్రేజ్‌ మరింత పెరిగింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అక్కడ వండే వివిధ రకాల రెసీపీల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఆ వ్యక్తి చేస్తున్న విధానన్ని మాత్రం అస్సలు చూసుండరు. కానీ అతను ఎలా చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు.

ఎలా చేశాడంటే..?
సాధారణంగా చికెన్‌ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసి మరీ డీప్‌ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. అది కామన్‌, అలా కాకుండా అల్లం వెల్లుల్లి , కొన్ని రకాల మసాల పొడులతో చికెన్‌ని మేరినేషన్‌ చేసి పేపర్‌ బ్యాగ్‌లో ప్యాక్‌ చేశారు.  అలా ఒక్కో చికెన్‌ ముక్కను పేపర్‌ బ్యాగ్‌లో పిన్‌ చేసి నేరుగా డీప్‌ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్‌ బ్యాగ్‌ కాబట్టి చక్కగా చికెన్‌ ఆ పేపర్‌ తోపాటు వేగిపోతుంది.

పైగా దాన్ని ఓపెన్‌ చేయగానే చికెన్‌లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్‌ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. టేస్ట్‌కి టేస్టు ఉంటుంది. ఇలా మలేషియాలోని వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా ఫోకస్‌ అంతా అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. అయితే ఆ పేపర్‌ బ్యాగ్‌ని పిన్‌చేస్తున్నారు కదా! ఏం ప్రమాదం కాదా? అనేది డౌటు. తినే కంగారులో ఆ ఫ్రైడ్‌ పేపర్‌ బ్యాగ్‌ చికెన్‌ని అలానే తింటేనే ప్రమాదం.

అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్‌ వ్లాగర్‌ వెరైటీగ్‌ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్‌ పెట్టి మరీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి చలా ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్‌ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్‌లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టలు పెట్టారు. 

A post shared by Trevor James (@thefoodranger)

(చదవండి: దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!)

whatsapp channel

మరిన్ని వార్తలు