పారాచూట్‌... ఫొటోషూట్‌

20 Feb, 2021 19:07 IST|Sakshi

వెస్ట్రన్‌ వెడ్డింగ్‌లో బ్రైడల్‌ వేర్‌ ఇండియన్‌ ఫ్యాషన్‌లో బ్రైట్‌ వేర్‌ హద్దులు చెరిపేసి ఫొటోషూట్స్‌లో గ్రేట్‌గా వెలిగిపోతోంది పారాచూట్‌ డ్రెస్‌.

పారాచూట్‌ మోడల్‌లో గౌన్లు మాత్రమే కాదు స్కర్ట్స్‌ కూడా రూపొందించారు డిజైనర్లు. గౌన్లు మాత్రం ఇప్పటికీ పాశ్చాత్యుల వివాహ సమయంలో పెళ్లికూతురు ధరించే డ్రెస్సులుగా పేరుపడిపోయాయి. ఇటీవల మన దగ్గర ప్రీ వెడ్డింగ్‌ షూట్స్, ప్రొఫైల్‌ పిక్స్‌.. కి ఈ పారాచూట్‌ డ్రెస్‌ తెగ సందడిచేస్తోంది. ప్లెయిన్‌ షిఫాన్, సిల్క్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే ఈ డ్రెస్సు ధరిస్తే లీల్లీ, లావెండర్‌ పూలు గుర్తుకురాకుండా ఉండవు. రెక్కలు విప్పార్చుకుంటూ ఎగిరే సీతాకోకచిలుక కళ్లముందు మెదలకుండా ఉండదు. 

రక్షణ గౌను
రెండవ ప్రపంచ యుద్ధంలో మేజర్‌ క్లాడ్‌ హెన్సింగర్‌కు జరిగిన ప్రమాదంలో పారాచూట్‌ను దుప్పటిగా ఉపయోగించాడు. తనను రక్షించిన నైలాన్‌ పారాచూట్‌ క్లాత్‌ను గౌనుగా రూపొందించమని తన ఫ్రెండ్‌ రూత్‌కు చెప్పాడు. రూత్‌ ఆ పారాచూట్‌తో వెడ్డింగ్‌ గౌను డిజైన్‌ చేసి, 1947లో జరిగిన వారి పెళ్లికి ధరించింది. ఆ తర్వాత ఆమె కూతురు, కోడలు కూడా వారి వివాహ సమయంలో ఈ గౌనును ధరించారు. ఈ పారాచూట్‌ మోడల్‌ నుంచి పుట్టుకొచ్చిందే ఈ విహంగ డ్రెస్‌. 

ఫెమినా మిస్‌ ఇండియా మానస వారణాసి డ్రెస్సింగ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు