ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..

30 Oct, 2021 15:45 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచమంతా పెనిస్‌ మష్రూమ్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని శాస్త్రీయనామం ఫాలస్‌ రూబికండస్‌. ఇది స్టిన్క్‌హాన్‌ కుటుంబానికి చెందిన ఫంగస్‌. దీనిని 1811లో కనిపెట్టారు. భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్‌, కొరియా, థాయ్‌లాండ్‌, ఘనా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రిక వంటి ఉష్ణమండల దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే దీనికి సంబంధించిన ఇమేజ్‌ను తాజాగా సైన్స్ అలర్ట్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ఏమిటి ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత
పెనిస్‌ పుట్టగొడుగులు ఎటువంటి మట్టిలోనైనా బతుకుతాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ పుట్టగొడుగులను జిరి-ఫిరి అని పిలుస్తారు. భరియా, బైగా ఆదివాసీల సంప్రదాయ ఔషధాల్లో ఇది ప్రముఖమైనది. ఈ పుట్టగొడుగులను టైఫాయిడ్‌, పేగు జ్వరాల నివారణకు ఔషధంగా వినియోగిస్తారు. చక్కెరతో ఈ పుట్టగొడుగులను బాగారుద్ది, ఎండబెట్టి పొడిచేస్తారు. ఈ పొడిని ప్రసవ సమయంలో మహిళలకు టీ స్పూను చొప్పున అందిస్తే సుఖ ప్రసవం జరుగుతుందట. అలాగే టైఫాయిడ్‌తో బాధపడుతున్నవారికి రోజుకు మూడు స్పూనుల చొప్పున పట్టిస్తే నయం అవుతుంది. ఈ విధంగా గిరిజనులు వివిధ రోగాలను నయంచేయడానికి పెనిస్‌ పుట్టగొడుగులను ఉపయోగిస్తుంటారు.

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

మన దేశంలోనేకాకుండా, ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు  లైంగిక శక్తిని పెంచే ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఐతే దాని వాసన చాలా ప్రమాదకరమైనది. ఈ పుట్టగొడుగుల వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. సాధారణంగా వర్షాల తర్వాత చాలా దేశాలలో పెరుగుతోంది.

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

మరిన్ని వార్తలు