పోనీ టెయిల్‌కి సెకండ్‌ వెర్షన్‌

3 Apr, 2021 19:52 IST|Sakshi

వేసవిలో జుట్టును లూజ్‌గా వదిలేయడం ఇబ్బందిగానే ఉంటుంది. వెంట్రుకలు మెడమీద పడకుండా, నీటుగా హెయిర్‌స్టైల్‌ ఉండాలనుకుంటే ఈ స్టైల్‌ను ఫాలో అవ్వచ్చు. ఇది పోనీటెయిల్‌కి సెకండ్‌ వెర్షన్‌గా చెప్పచ్చు. 

జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. తర్వాత అటూ ఇటూ రెండు పాయలు తీసి ఒక పాయగా కలిపేసి, మధ్యన రబ్బర్‌ బ్యాండ్‌ వేయాలి.

రబ్బర్‌ బ్యాండ్‌ వేసిన పాయకు దిగువ భాగాన మరొక రబ్బర్‌ బ్యాండ్‌ వేయాలి.
 
రెండు రబ్బర్‌ బ్యాండ్స్‌ మధ్యలో ఉన్న హెయిర్‌ను ఓవెల్‌ షేప్‌ ఖాళీ ఉంచి, ఆ మధ్యలో నుంచి మిగతా హెయిర్‌ను బయటకు తీసి, ఒకసారి దువ్వెనతో దువ్వి, వదిలేయాలి.  

జుట్టు మందంగా ఉన్నవారు మధ్య నుంచి ఒక పాయగా తీసి, మెడమీద మిగతా హెయిర్‌తో కలిపి ఒక రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకోవచ్చు. దీనివల్ల మెడ మీద చెమట కు వెంట్రుకలు చికాకు పెట్టకుండా, హెయిర్‌స్టైల్‌ నీటుగా ఉంటుంది. 

– సత్యశ్రీ సుతారి
హెయిర్‌ స్టైలిస్ట్, ఫస్ట్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు