Pooja Hegde: థింకింగ్, ఫాస్ట్‌ అండ్‌ స్లో.. ‘రెండూ అబద్ధాలే ఎందుకు కాకూడదు’!

6 May, 2022 12:42 IST|Sakshi

పూజా హెగ్డే ఫేవరెట్‌ బుక్‌

థింకింగ్, ఫాస్ట్‌ అండ్‌ స్లో–డేనియల్‌ కానెమెన్‌ 

ఈ పుస్తకం గురించి ఆసక్తికర విషయాలు

Thinking Fast And Slow Book By Daniel Kahneman: బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఖాళీ సమయాల్లో పుస్తకాలతో గడపడం అంటే ఇష్టం. వాటికి సంబంధించిన ఫొటోలను  సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటుంది. పూజాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి...నోబెల్‌ బహుమతి గ్రహీత, ఇజ్రాయెల్‌–అమెరికన్‌ సైకాలజిస్ట్‌ డేనియల్‌ కానెమెన్‌ రాసిన ‘థింకింగ్, ఫాస్ట్‌ అండ్‌ స్లో’ అనే పుస్తకం.

స్టార్‌డమ్‌తో కూడిన లైఫ్, సాధారణ లైఫ్‌కు మధ్య, ప్రశంసలు, విమర్శలకు మధ్య తనను తాను సమన్వయం చేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఉపకరిస్తాయి. ఈ పుస్తకం గురించి...

రెండు మానసిక ప్రపంచాల మధ్య...
తన పుస్తకరచనలో భాగంగా కొద్దిమంది యువకులను ఎంచుకొని ‘ఈ నెలలో మీరు ఎన్నిరోజులు సంతోషంగా ఉన్నారు?’ అనే ప్రశ్న ఇస్తే చాలామంది నుంచి ‘జీరో’ అనే జవాబు వచ్చింది. అలా అని వారిజీవితాల్లో విషాదాలేవీ చోటు చేసుకోలేదు. ఓటమిలాంటివేవీ ఎదురుకాలేదు. రోజులు గడిచాయి...అలా గడిచాయి...అంతే!

అసలు సంతోషంగా ఉండడానికి, ఉన్నాము అని చెప్పడానికి కొలమానం ఏమిటి?... ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ‘థింకింగ్, ఫాస్ట్‌ అండ్‌ స్లో’ పుస్తకం చదవాల్సిందే.రెండు రకాలైన మానసిక పరిస్థితుల మధ్య వైరుధ్యాలను కేంద్రంగా తీసుకొని డేనియల్‌ లోతుగా పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు.

సిస్టం–1
ఆటోమేటిక్, ఫ్రీక్వెంట్, ఎమోషనల్, స్టీరియోటైప్, అన్‌కాన్షియస్‌

సిస్టం–2
ఎఫెక్ట్‌పుల్, ఇన్‌ఫ్రీక్వెంట్, లాజికల్, క్యాలిక్యులేటింగ్, కాన్షియస్‌నెస్‌
కొన్ని సందర్భాలలో సిస్టం–1 చేయలేని పనులను సిస్టం–2 ఎలా చేస్తుందో చెబుతారు రచయిత. ఇదే సందర్బంలో కొన్ని భ్రమల గురించి కూడా చెబుతారు. రెండు అబద్దాలు మనకు చెప్పి ‘ఇందులో ఏది నిజం?’ అని అడిగితే ఏదో ఒకటి చెబుతాం. ‘రెండు అబద్ధాలే ఎందుకు కాకూడదు’ అనే ఆలోచన చాలా అరుదుగా వస్తుంది.

ఉదా: హిట్లర్‌ వాజ్‌ బార్న్‌ ఇన్‌ 1892
        హిట్లర్‌ వాజ్‌ బార్న్‌  ఇన్‌ 1887

‘ది లేజీ సిస్టమ్‌–1’ ‘ది లేజీ సిస్టమ్‌–2’ ‘స్పీకింగ్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ ‘స్పీకింగ్‌ ఆఫ్‌ జడ్జిమెంట్‌’ ‘స్ట్రైయిన్‌ అండ్‌ ఎఫర్ట్‌’....మొదలైన విభాగాలలో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘మన పనితీరుపై మనం అంచనా వేసుకోవడం కంటే ఇతరుల పనితీరుపై తీర్పులను ప్రకటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం’ అంటున్న రచయిత స్వీయవిశ్లేషణ ఇచ్చే మంచి ఫలితాల గురించి చెబుతారు.

చదవండి👉🏾 Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే!

మరిన్ని వార్తలు