పొటాటో పోషణ 

19 May, 2022 07:35 IST|Sakshi

బ్యూటిప్‌

  • బంగాళ దుంపలను తొక్కతీసి తురుముకుని రెండు టీస్పూన్ల రసం తీసుకోవాలి. ఈ రసంలో టీస్పూను రోజ్‌ వాటర్, ఐదు చుక్కలు నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి ఆరేంత వరకు మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడగాలి. 
  • వారంలో రెండు మూడుసార్లు ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది 
  • దీనిలోని కాపర్, జింక్‌లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తాయి 
  • పొటాషియం, మెగ్నీషియంలు చర్మానికి పోషకాలను అందిస్తాయి 
  • క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వేసుకుంటే చర్మంలో త్వరగా మంచి మార్పు కనిపిస్తుంది.   
మరిన్ని వార్తలు