పాలిచ్చే తల్లులూ... తీసుకోవాల్సిన ఆహారాలు! 

27 Mar, 2021 21:30 IST|Sakshi

మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్‌)  కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ ఇష్టంగా ఆస్వాదిస్తూ తల్లిపాలను తాగుతుంటాడు. ఇక్కడ చిన్నజాగ్రత్త పాటించాలి. తల్లి తినే పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. లేకపోతే వాటిపై ఉండే క్రిమిసంహారక రసాయనాలు తల్లిలోకి, అక్కడినుంచి బిడ్డకు ఇచ్చే పాలలోకీ ప్రవేశించి, బిడ్డ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందుకే వాటిని బాగా కడిగాక మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. 

  • తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్‌), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి.
  •  పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. 
  • తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్‌ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. 
  • తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్‌ వంటివి తీసుకోవాలి. 
  • క్యాల్షియమ్‌ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. 
  • విటమిన్‌ బి12తో పాటు విటమిన్‌ డి సమృద్ధిగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. తీసుకోని వారు డాక్టర్‌ సలహా మేరకు విటమిన్‌ బి12, విటమిన్‌–డి సప్లిమెంట్స్‌ మాత్రల రూపంలో తీసుకోవాలి. 
Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు