అన్నమయ్య సంకీర్తనలు- సామాజిక దృక్పథంపై కార్యక్రమం

19 Apr, 2021 18:13 IST|Sakshi

నార్వే  : అన్నమయ్య సంకీర్తనలు - సామాజిక ధృక్పథంపై ‘వీధి అరుగు’ వేదికగా ఈ నెల 25న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం​ ద్వారా అన్నమాచార్య సంకీర్తనలతో సమాజంలో మార్పు, చైతన్యం ఎలా తీసుకురావచ్చని నిర్వహకులు తెలిపారు. ఆధ్యాత్మిక భావనల ద్వారా ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు.. సమకాలీన సామాజికాంశాలపై పోరాటం చేయటానికి గురు జ్యోతిర్మయి ఎంచుకున్న సాధనాలేమిటి ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసురాలు, సంఘసేవకులు కొండవీటి జ్యోతిర్మయి విశిష్ట అతిథిగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని వేదిక నిర్వహాకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నిర్వహకులు విడుదల చేశారు. నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది తెలుగు భాషాభిమానులు ‘వీధి అరుగు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్‌లో పలు  కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

చదవండి: ఒక మనిషికి ఇన్ని పేర్లా?..

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు